కోర్టుకి 13 రామచిలకలు... ఏం నేరం చేశాయి..?

Published : Oct 17, 2019, 01:40 PM IST
కోర్టుకి 13 రామచిలకలు... ఏం నేరం చేశాయి..?

సారాంశం

అక్రమంగా విదేశాలకు రామచిలకలను తరలిస్తున్నాడనే ఆరోపణల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా... అతనిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అతనితోపాటు... ఆ 13 రామ చిలుకలను కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతను వాటిని అక్రమంగా తరలిస్తున్నాడని నిరూపించేందుకు వారు అలా చేశారు.

ఓ కేసులో పోలీసులు 13 రామ చిలుకలను ప్రవేశపెట్టారు. చిలకలను కోర్టుకి తీసుకురావడం ఏంటి..? అవేమి నేరం చేశాయి అని మీరు అనుకుంటున్నారా..? నేరం చేసింది అవి కాదు....  కానీ ఓ వ్యక్తి నేరం చేశాడు అని నిరూపించడానికి వాటిని కోర్టుకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 13 రామచిలుకలను సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఉజ్జెకిస్థాన్ కి వెళ్తున్న అన్వర్ జాన్ అనే వ్యక్తి పై పోలీసులకుక అనుమానం కలిగింది. దీనిలో భాగంగా అతనిని తనిఖీ చేయగా... అతని వద్ద ఓ బాక్స్ దొరికింది. చెప్పులు పెట్టుకునే బాక్స్ లో అతను 13 రామ చిలకలను ఉంచాడు.

దీంతో వెంటనే వాటిని పోలీసులు బయటకు తీశారు. అక్రమంగా విదేశాలకు రామచిలకలను తరలిస్తున్నాడనే ఆరోపణల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా... అతనిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అతనితోపాటు... ఆ 13 రామ చిలుకలను కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతను వాటిని అక్రమంగా తరలిస్తున్నాడని నిరూపించేందుకు వారు అలా చేశారు.

కాగా.. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రామచిలుకలను తరలించడం నేరమని అన్వర్ జాన్ ను అక్టోబర్ 30వరకు జ్యూడిషయల్ కస్టడీకీ తరలించింది. అంతేకాకుండా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ని కూడా కోర్టు తిరస్కరించింది. ఆ పదమూడు రామచిలుకలను అటవీ సంరక్షణ శాఖ అధికారులకు అందజేస్తూ వాటిని అభయారణ్యంలో వదిలిపెట్టాలని కోర్టు తీర్పు వెల్లడించింది.

అయితే... సీఐఎస్ఎఫ్ చేపట్టిన విచారణలో అన్వర్ జాన్పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఉజ్జెకిస్థాన్ లో రామ చిలుకులకు విపరీతమైన డిమాండ్ ఉందని.. అందుకే వాటిని అక్కడ అమ్ముందామని వెళ్దామనుకుంటున్నట్లు చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

Overworked: ఆఫీస్‌లో 70 గంటలకు పైగా ఉద్యోగం.. చివరికి విడాకులు కోరిన భార్య.. టెక్కీ మనో వేదన ఇలా!
Sunflowers History: సర్‌ఫ్లవర్ సూర్యడివైపు ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా? సైన్స్‌, గ్రీకు కథ ఎం చెబుతుందంటే?