భర్తతో వీడియో కాల్‌.. దూసుకొచ్చిన రాకెట్: ఇజ్రాయెల్‌లో కేరళ మహిళ మృతి

By Siva Kodati  |  First Published May 12, 2021, 5:25 PM IST

ఇజ్రాయిల్ ‌- పాలస్తీనా మధ్య ఘర్షణలతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయిల్‌ రాజధాని జెరూసలేంలో కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పాలస్తీనాలో గాజాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి వరుసగా రాకెట్ దాడులు పాల్పడుతోంది


ఇజ్రాయిల్ ‌- పాలస్తీనా మధ్య ఘర్షణలతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయిల్‌ రాజధాని జెరూసలేంలో కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పాలస్తీనాలో గాజాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి వరుసగా రాకెట్ దాడులు పాల్పడుతోంది.

దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరు ప్రాంతాల మధ్య జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 28 పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 16 మంది ఉగ్రవాదులేనని ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. అయితే మరణించిన వారిలో భారతీయ మహిళ కూడా వున్నారు. 

Latest Videos

undefined

Also Read:గాజాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి: 35 మంది మృతి

కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడుకు చెందిన ఎంఎస్ సౌమ్య ఏడేళ్లుగా ఇజ్రాయెల్‌ అష్కెలోన్ నగరంలో పనిమనిషిగా చేస్తోంది. తాజాగా పాలస్తీనా జరిపిన రాకెట్‌ దాడిలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

అష్కెలోన్ నగరంలో తన నివాసంలో ఉన్న సౌమ్య మంగళవారం సాయంత్రం భర్త సంతోశ్‌తో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా పాలస్తీనా ఉగ్రవాదులు వదిలిన రాకెట్‌ ఆమె ఇంట్లో పడి పేలింది. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.   

కేరళ మహిళ సౌమ్య సంతోష్ మరణం పట్ల ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం తరఫున తాను సౌమ్య కుటుంబంతో మాట్లాడానని, ఆమె మృతికి మొత్తం దేశమంతా చింతిస్తోందని ఆయన పేర్కొన్నారు. సౌమ్య, సంతోష్ దంపతుల 9 ఏళ్ళ కుమారుడికి కూడా ఆయన ప్రత్యేకంగా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు

click me!