నిందితుడు అతని తల్లిని వెనక నుంచి పట్టుకొని.. ఆమె నేల మీద కింద పడేవరకు ఉక్కిరిబిక్కరి చేశాడట. లైంగిక దాడి చేయడానికి సహకరించలేదనే కారణంతో.. దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా అందరూ మాతృదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తల్లిని గౌరవిస్తూ.. ప్రతి ఒక్కరూ ఆరోజు సోషల్ మీడియాలో మెసేజ్ లతో హోరెత్తించారు. అలాంటి మధర్స్ డే రోజున ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. కన్న తల్లిని లైంగికంగా వేధించాడు. అంతే కాకుండా అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... నిందితుడు ఒక భారతీయుడు కావడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. సోరజ్ శర్మ(65) తన కొడుకు, కూతురితో కలిసి న్యూయార్క్ లో జీవిస్తోంది. కాగా... మాతృదినోత్సవం రోజున సోరజ్ శర్మ ను ఆమె కుమారుడు పుష్కర్ శర్మ(28) అతి దారుణంగా హత్య చేశాడు.
నిందితుడు అతని తల్లిని వెనక నుంచి పట్టుకొని.. ఆమె నేల మీద కింద పడేవరకు ఉక్కిరిబిక్కరి చేశాడట. లైంగిక దాడి చేయడానికి సహకరించలేదనే కారణంతో.. దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ముందు గొంతు కోసేసి.. ఆ తర్వాత దారుణంగా కొట్టాడు. దీంతో.. ముందుగా ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ప్రాణాలు విడిచింది.
తల్లిని హత్య చేసిన అనంతరం పుష్కర్ శర్మ అక్కడి నుంచి చాలా దూరం వెళ్లిపోయాడు. కాగా.. తల్లి ప్రాణాలు కోల్పోయి పడి ఉండటాన్ని.. కూతురు గమనించింది. వెంటనే పోలీసులు సమాచారం అందించింది. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
కాగా.. నిందితుడికి పుష్కర్ శర్మ.. కి మానసిక సమస్యలు ఉన్నట్లు చుట్టుపక్కల వారు చెప్పడం గమనార్హం. అయితే.. ఆ కుటుంబం చాలా మంచిగా ఉండేదని.. అతను అలా తల్లిని హత్య చేస్తాడని తాము ఊహించలేకపోయామని వారు చెప్పడం గమనార్హం.