ఇండియాపై ట్రావెల్ బ్యాన్: భారత విద్యార్ధులకు అమెరికా శుభవార్త

By Siva Kodati  |  First Published May 4, 2021, 9:54 PM IST

భారత విద్యార్ధులకు అమెరికా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 1 నుంచి క్లాసులు ప్రారంభమయ్యే విద్యార్ధులకు తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతించింది. అయితే కరోనా ఉద్ధృతితో భారత ప్రయాణీకులపై అమెరికా ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ విద్యార్ధులకు మాత్రం ఊరట కల్పించింది. 

మరోవైపు భారత్‌లో కరోనా కేసులు పెరిగి పోతుండటంతో అమెరికా ప్రభుత్వం విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. గత శుక్రవారం ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ నిషేధాన్ని ప్రకటించారు.

Latest Videos

Also Read:భారత్ నుంచి వెంటనే వెనక్కి వచ్చేయండి.. దేశపౌరులకు అమెరికా ఆదేశాలు..

విద్యార్థులు, జర్నలిస్టులు, కొందరు వ్యక్తులకు మాత్రం ఈ నిషేధం నుంచి అగ్ర రాజ్యాధినేత మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో మినహాయింపు పొందిన వారిలో గ్రీన్‌ కార్డు హోల్డర్లు, వారి 21 ఏళ్లలోపు సంతానం వున్నారు.

అయితే ఈ ఆంక్షలు ఎన్నాళ్లు అమల్లో ఉంటుందన్న విషయాన్ని మాత్రం అమెరికా ప్రభుత్వం వెల్లడించలేదు. దీంతో మరోసారి అధ్యక్ష ప్రకటన వెలువడే వరకూ ఇది అమల్లో ఉంటుందని భావిస్తున్నారు. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సిఫార్సుల మేరకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకొన్నారు.  
 
click me!