అమెరికాలో జాత్యంహకంరానికి బలైన తెలుగు సాప్ట్ వేర్ కూచిబొట్ల శ్రీనివాస్(32) కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టు హంతకుడు ఆడమ్ ప్యూరింటన్ కు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వీటిని అతడు ఒకటి తర్వాత ఒకటి అనుభవించాల్సి ఉంటుందని అమెరికన్ న్యాయస్థానం పేర్కొంది.

2017 ఫిబ్రవరిలో శ్రీనివాస్ కూచిబొట్ల(32 )తన స్నేహితుడు అలోక్ తో కలిసి ఓ బార్ లో ఉండగా వీరిపై కాల్పులు జరిగాయి. జాత్యంహకారంతో వీరిని దూషిస్తూ ప్యూరింటన్ అనే అమెరికన్ పౌరుడు తన గన్ తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ప్యూరింటన్ ని అడ్డుకోడానికి ప్రయత్నించి ఓ అమెరికన్ కూడా గాయాలపాలయ్యాడు. ఈ హత్య కేసు అటు అమెరికాతో పాటు ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
undefined
ఈ కేసులో అరెస్టయిన ప్యూరింటన్ జాతివిద్వేశంతోనే హత్య చేసినట్లు కోర్టు ముందు అంగీకరించాడు. దీంతో అతడికి జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టు మూడు యావజ్జీవ వశిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటనపై మృతుడు శ్రీనివాస్ భార్య మాట్లాడుతూ...తన భర్తతో నిందితుడు ఒక్కసారి మాట్లాడి ఉంటే అతడెంత మంచివాడో అర్థమయ్యేదని అన్నారు. దీంతో అతడు జాత్యంహకారంతో ఈ కాల్పులకు పాల్పడి ఉండేవాడు కాదని సునయన ఆవేదనతో మాట్లాడారు.