సుధీర్ఘ ప్రస్థానానికి వీడ్కోలు.. పెప్సీకో సీఈవో పదవికి ఇంద్ర నూయీ గుడ్‌బై

 |  First Published Aug 6, 2018, 7:11 PM IST

శీతల పానీయాల దిగ్గజం పెప్సీకోతో తన అనుబంధాన్ని తెంచుకున్నారు ఇంద్ర నూయీ. కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.


శీతల పానీయాల దిగ్గజం పెప్సీకోతో తన అనుబంధాన్ని తెంచుకున్నారు ఇంద్ర నూయీ. కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. తదుపరి సీఈవోగా పెప్సీకో అధ్యక్షుడు రామొన్ లగుయార్టా బాధ్యతలు చేపడతారు. గతేడాది జరిగిన పెప్సీకో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో సీఈవోగా రామొన్ పేరును ప్రతిపాదించి.. ఏకగ్రీవంగా ఆమోదించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. 24 ఏళ్లుగా కంపెనీలో ఉంటూ 12 ఏళ్లుగా సీఈవో పదవిని నిర్వహించానని.. ఇలాంటి అవకాశాన్ని నేనెప్పుడూ ఊహించలేదని ఇంతకంటే గొప్ప గౌరవం ఉండదని తాను భావిస్తున్నానని తెలిపారు. పన్నేండేళ్లుగా సహకరించిన షేర్‌హోల్డర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు..

Latest Videos

తన తర్వాత బాధ్యతలు చేపట్టనున్న లగుయార్టా సమర్థుడైన వ్యక్తని తనకు మంచి మిత్రుడని.. పెప్సీకో విజయపథంలో దూసుకువెళ్లేలా రామొన్ కృషి చేస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.. పెప్సీకో భవిష్యత్తులో మరిన్ని మంచి రోజులు చూస్తుందని తెలిపారు. భారత సంతతికి చెందిన ఇంద్రానూయి 1994లో కంపెనీలోకి ప్రవేశించి.. 2006లో సీఈవో అయ్యారు. తద్వారా పెప్సీకో సంస్థల్లో మొదటి మహిళా సీఈవోగా ఆమె చరిత్ర సృష్టించారు.

click me!