బహ్రెయిన్ లో ఆచార్య జయశంకర్ 84వ జయంతి వేడుకలు

First Published Aug 6, 2018, 3:06 PM IST
Highlights

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్వర్యంలో ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 84వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి.. ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్వర్యంలో ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌  84వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి.. ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . ఈ సందర్భంగా శాఖ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కిరణం ఎందరికో స్ఫూర్తిప్రదాత ఆచార్య జయశంకర్ అన్నారు.

‘‘ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన మహనీయుడు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నలుదిక్కులచాటిన ధీరశాలి మహోన్నత వ్యక్తి. తెలంగాణశ్వాస.. తెలంగాణ మట్టిమనిషి ఆచార్య జయశంకర్  ఆయన మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయాలు మాత్రం తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలందరి మధ్యలో బ్రతికే ఉంటాయి. ఆనాడు ఆయన చేసిన పోరాటఫలమే మనకు ఈనాడు తెలంగాణకు స్ఫూర్తినిచ్చింది. ఆయన  కలలుకన్నా స్వరాష్ట్రం లో మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సారధ్యంలో మన ముందు గెలిచి నిలిచింది.’’ 

‘‘మన తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆయన చూపిన మార్గంలో బంగారు తెలంగాణ కోసం కలిసి కట్టుగా జయశంకర్ సర్ స్పూర్తితో ముందుకు తీసుకెళ్ళి తెలంగాణను సమగ్రంగా అభివృద్ది చేయడంమే నిజమైన బంగారు తెలంగాణ’’ అని వివరించారు. మంచివాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలని, మంచి స్ఫూర్తితో మన అందరం కేసీఆర్ కు అండదండగ కలసి ముందుకు సాగుదాంమని పిలుపునిచ్చారు.

 ‘భావజాల యుద్దం గెలవలేని వారు రాజకీయ యుద్దంగెలవలేరని’ జయశంకర్‌  ఆనాడు చెప్పింది అక్షర సత్యమని జయశంకర్‌ తనజీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహనీయుడని ఆయన రచనలు, ప్రసంగాలు ప్రత్యేక తెలంగాణ లక్షలాదిప్రజలను ఉర్రూతలూగించిన్న తెలంగాణ వైతాళికునిగా, గొప్ప కృషి చేశారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, సెక్రెటరీలు గంగాధర్ గుముళ్ల, విజయ్ ఉండింటి, జాయింట్ సెక్రటరీ దేవన్న బాల్కొండ, ప్రమోద్ బొలిశెట్టి, సాయన్న కొత్తూరు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నర్సయ్య తలరి,గంగారాం ఆలోళ్ళ, చందు, నరేష్ తో పాటు తెలంగాణ జాగృతి బహ్రెయిన్ అధ్యక్షుడు బాబు బ‌ర్కుంట తదితరులు పాల్గొన్నారు.

click me!