విహార యాత్రలో విషాదం: రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి

First Published 5, Aug 2018, 9:40 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన గుజ్జ నవీన్‌(22) అనే ఎంబీబీఎస్‌ విద్యార్థి రష్యాలో మరణించాడు.

భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన గుజ్జ నవీన్‌(22) అనే ఎంబీబీఎస్‌ విద్యార్థి రష్యాలో మరణించాడు. భువనగిరి పట్టణంలోని ఆర్‌బీనగర్‌కు చెందిన గుజ్జు హేమలత, యాదగిరి దంపతులకు ఇద్దరు పిల్లలు. 

వారిలో పెద్ద కుమారుడు గుజ్జ నవీన్‌. నవీన్‌ రష్యాలోని ఓరన్‌బాగ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. జన్మదిన వేడుకలు జరుపుకుందామని స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు.

అందులో భాగంగా ఓ డ్యాం వద్ద సరదాగా ఈత కొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. ఈ విషయాన్ని స్నేహితులు, ఫోన్‌ ద్వారా నవీన్‌ తల్లిదండ్రులకు తెలిపారు. 

Last Updated 6, Aug 2018, 4:37 PM IST