కెనడాలో కాల్పులు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారత్ కు చెందిన సత్వీందర్ సింగ్ మృతి

By narsimha lodeFirst Published Sep 19, 2022, 5:34 PM IST
Highlights

కెనడాలో జరిగిన కాల్పుల్లో  భారత్ కు చెందిన సత్వీందర్ సింగ్ మరణించారు. ఈ నెల 12న జరిగిన కాల్పుల్లో సత్వీందర్ సింగ్ గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన  మరణించాడు. 

ఒట్టావా: కెనడాలోని అంటారియో ఫ్రావిన్స్ లో గత వారం జరిగిన కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్ధి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకి చేరింది. 

ఈ నెల 12వ తేదీన ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ తో పాటు మరో ఇద్దరిని తుపాకీతో కాల్పి చంపాడు.  ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ  ఘటన తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై కాల్చి చంపారు. ఈ నెల 12న జరిగిన కాల్పుల ఘటనలో సత్విందర్ సింగ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం నాడు మృతి చెందాడు. 

ఎంకె ఆటో రిపేర్ యజమానిని నిందితులు కాల్చి చంపారు. షూటింగ్ సమయంలో ఎంకె ఆటో రిపేర్ సంస్థలో సత్వీందర్ సింగ్ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. నిందితుడు జరిపిన కాల్పుల్లో సత్వీందర్ సింగ్ గాయపడ్డాడు. కరోనా కు ముందు నుండి సత్వీందర్ సింగ్ తన తండ్రిని కలవలేదు. 

also read:స్కాట్లాండ్​లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు తెలుగు విద్యార్థుల మృతి.. మ‌రోక‌రి ప‌రిస్థితి విష‌మం..

శనివారం నాడు సత్వీందర్ సింగ్  మరణించినట్టుగా ఆయనతో పాటు ఉంటున్న బంధువు సరబ్జోత్ సింగ్ టొరంటో స్టార్ వార్తాపత్రికకు చెప్పారు.  ఇండియాలో  మార్కెటింగ్ లో ఎంబీఏ పట్టా పొందాడు సత్వీందర్ సింగ్. కెనడాలోని కొనెస్టొగా కాలేజీలో చదువుతున్నాడు.  సత్వీందర్ సింగ్ మృతితో  కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

click me!