అమెరికాలో మహిళా రోగులపై లైంగిక వేధింపులు.. 68 యేళ్ల భారతీయ సంతతి వైద్యుడిపై అభియోగాలు..

By SumaBala Bukka  |  First Published May 9, 2023, 11:28 AM IST

జార్జియాలోని డెకాటూర్‌లోని వెటరన్స్ అఫైర్స్ మెడికల్ సెంటర్‌లో పనిచేసిన రాజేష్ మోతీభాయ్ పటేల్ మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలు మోపబడ్డాయి. 


అమెరికా : అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని  68 ఏళ్ల భారతీయ సంతతి ప్రైమరీ కేర్ ఫిజిషియన్ మీద లైంగిక వేధింపుల ఆరోపణల కింద అభియోగాలు చేశారు. ఆ డాక్టర్ 12 నెలల వ్యవధిలో రెగ్యులర్ చెకప్స్ సమయంలో తన దగ్గరికి వచ్చిన నలుగురు మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయని.. ఈ మేరకు అభియోగాలు మోపారని అక్కడి డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా తెలిపింది.

జార్జియాలోని డెకాటూర్‌లోని వెటరన్స్ అఫైర్స్ మెడికల్ సెంటర్‌లో పనిచేసిన రాజేష్ మోతీభాయ్ పటేల్, మహిళా రోగుల చట్టపరమైన హక్కులను కాల రాశాడు. వైద్యం ముసుగులో వారితో అవాంఛిత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శారీరక భద్రతకు తన రోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘించారని ఆరోపించబడింది. ఈ మేరకు మే 4న ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

Latest Videos

undefined

భార్యతో విడాకులు తీసుకున్న భర్త.. సంతోషంలో బంగీ జంప్, రోప్ తెగిపోవడంతో..

"పటేల్ 2019 - 2020 మధ్య తన మహిళా రోగులను లైంగికంగా వేధించాడని,  తన సంరక్షణలో ఉన్న రోగులకు ఎటువంటి హాని చేయకూడదన్న ప్రమాణాన్ని ఉల్లంఘించాడని ఆరోపించారు" అని యుఎస్ అటార్నీ ర్యాన్ కె బుకానన్ అన్నారు.

"వెటరన్ అఫైర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ మైఖేల్ జె మిస్సా మాట్లాడుతూ, వెటరన్న, వారి కుటుంబాలు సురక్షితమైన, జవాబుదారీతనంతో అందించబడే అత్యంత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఆశిస్తున్నాయి. దీనికి వీరు అర్హులు కూడా’ అన్నారు. 

"సదరు సుప్రసిద్ధులు మన దేశం కోసం అద్భుతమైన త్యాగాలు చేశారు. వారు అత్యుత్తమ వైద్య చికిత్స,  అత్యున్నత నాణ్యమైన సంరక్షణకు అర్హులు" అని బుకానన్ ఉటంకించారు. ఈ కేసును డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్, ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ దర్యాప్తు చేస్తోందని ప్రకటన విడుదల చేసింది.

click me!