అమెరికాలో ఇద్దరిని హత్య చేసిన భారతీయ సంతతి వ్యక్తి...

By SumaBala Bukka  |  First Published May 6, 2023, 11:21 AM IST

అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పార్కింగ్ స్థలంలో ఏదో గొడవ పడ్డ ఓ భారతీయ సంతతి వ్యక్తి ఇద్దరిని కాల్చి చంపాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


అమెరికా : అమెరికాలోని ఒరెగాన్‌లోని ఓ మాల్‌లోని పార్కింగ్ స్థలంలో ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపినందుకు 21 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జోబన్‌ప్రీత్ సింగ్, 21 అనే యువకుడి మీద గురువారం రెండు హత్యల ఆరోపణలపై ముల్ట్‌నోమా కౌంటీ డిటెన్షన్ సెంటర్‌లో మొదటి డిగ్రీలో కేసు నమోదు చేయబడినట్లు పోర్ట్‌ల్యాండ్ పోలీస్ బ్యూరో తెలిపింది. 

బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కాల్పుల ఘటనపై అధికారులకు సమాచారం అందింది. స్థానిక కాలమానం ప్రకారం  ఆగ్నేయ బార్బర్ బౌలేవార్డ్  9100 బ్లాక్‌లో పార్కింగ్ స్థలంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు గుర్తించారు. మరణించిన ఇద్దరు వ్యక్తులను పోర్ట్‌ల్యాండ్ పోలీసులు ఇంకా గుర్తించలేదని మీడియా నివేదికలు తెలిపాయి.

Latest Videos

undefined

ఒరెగాన్‌లైవ్ ప్రకారం, విచారణ కోసం గురువారం కోర్టులో సింగ్ హాజరయ్యాడు. ఆ సమయంలో అతని మీద రెండు ఫస్ట్-డిగ్రీ హత్యలు, నాలుగు చట్టవిరుద్ధమైన ఆయుధాలను ఉపయోగించిన నేరాలు మోపబడ్డాయి. కానీ అతను వాటిని అంగీకరించలేదు. పోలీసులకు వీడియో ఫుటేజీలో కనిపించిన దాని ప్రకారం, సింగ్, మరో ఇద్దరు స్నేహితులు బెంటోజ్ టెరియాకి రెస్టారెంట్ వెలుపల ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. 

కోవిడ్-19 ఇక మీదట ప్రపంచ విపత్తు కాదు.. : డబ్ల్యూహెచ్వో

కాసేపటికి సింగ్ లేచి అప్పుడే కారును పార్క్ చేసిన వ్యక్తి వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఫోన్ మాట్లాడుతున్న మరొక వ్యక్తి ఆ కారు వద్దకు వస్తున్న సింగ్ ను చూసి వేగంగా అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత సింగ్ తన జేబులోంచి పిస్టల్ తీసి, తన ముందు ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఎక్కుపెట్టి, "అనేక రౌండ్లు కాల్చాడు" అని ముల్ట్‌నోమా కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ మార్గరెట్ బర్గెస్ అఫిడవిట్‌లో రాశారు. దీంతో ఇద్దరు వ్యక్తులు పార్కింగ్ స్థలంలో పేవ్‌మెంట్‌పై కుప్పకూలిపోయారు. తర్వాత కూడా సింగ్ కాల్పులు జరుపుతూనే ఉన్నాడని నివేదిక పేర్కొంది.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, సింగ్ 911కి కాల్ చేసి కాల్పులు జరిగినట్లు తెలియజేసాడు. ఘటనా స్థలంలోనే సింగ్ ను అరెస్టు చేసినట్లు ఒరెగాన్‌లైవ్ నివేదించింది. అఫిడవిట్‌లో కాల్పులకు దారితీసిన విషయాన్ని పేర్కొనలేదు. కానీ సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరునుంచి పది రౌండ్ల తుపాకీ కాల్పులు వినిపించడానికి ముందు.. వారినుంచి అరుపులు లేదా వాదనలు వినిపించాయని చెప్పారు. 

"ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ముఖాముఖీ వచ్చాడు. ఆ తరువాతే షూటర్ తన తుపాకీని బయటకు తీశాడు. అది చూసి ఇద్దరు యువకులు పరుగెత్తారు" అని ఓ సాక్షి ఒరెగాన్‌లైవ్‌తో చెప్పారు. కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలు ధరించినట్లు కనిపించడం లేదని, ఆ వ్యక్తులు ఏమి వాదించుకుంటున్నారో తనకు తెలియదని వారు తెలిపారు. ఈ కేసులో బెయిల్ లేకుండా జైలులో ఉన్న సింగ్, మే 12న కోర్టుకు తిరిగి హాజరు కావాల్సి ఉంది. 

click me!