చైనాలో మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థి ఒకరు అనారోగ్యంతో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి వారు విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయం కోరుతున్నారు.
హైదరాబాద్ : చైనాలో గత ఐదేళ్లుగా మెడిసిన్ చదువుతున్న తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. వారిది ఆర్థికంగా నిరుపేద కుటుంబం. దీనివల్ల అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి సహాయం చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను అతని కుటుంబం అభ్యర్థించింది.
భారతీయ విద్యార్థి, అబ్దుల్ షేక్ మెడికల్ ఎడ్యుకేషన్ చివర్లో ఉన్నాడు. ఇందులో భాగంగా చైనాలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. ఇటీవలే భారత్‌కు వచ్చిన అబ్దుల్ షేక్.. డిసెంబర్ 11న తిరిగి చైనాకు వెళ్లిపోయాడు.
undefined
అమెరికాలో విహారయాత్రకు వెళ్లి.. సరస్సు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి...
విదేశాల నుంచి చైనాకు వెళ్లినవారు తప్పనిసరిగా ఎనిమిది రోజుల ఐసోలేషన్ లో ఉండడం అక్కడ మాండేటరీ. ఈ ఐసోలేషన్ తర్వాత, షేక్ ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్ మెడికల్ యూనివర్శిటీలో ఇంటర్‌నింగ్‌లో ఉన్నాడు. అదే సమయంలో అనారోగ్యం బారిన పడ్డాడు. అది తీవ్రం కావడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. అక్కడ అతను చికిత్స తీసుకుంటూనే మరణించాడు.
అబ్దుల్ షేక్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి విద్యార్థి కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి కూడా వారు విజ్ఞప్తి చేశారు.