క్రిమియాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి...

By SumaBala Bukka  |  First Published Dec 30, 2022, 9:37 AM IST

క్రిమియా దేశంలో జరిగిన కారు ప్రమాదంలో భారత్ కు చెందిన నలుగురు వైద్యవిద్యార్థులు మృతి చెందారు. 


క్రిమియా : క్రిమియా దేశంలోని సింఫెరోపోల్ నగరం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత్ కు చెందిన నలుగురు విద్యార్థులు  మృత్యువాత పడ్డారు. ఈ నలుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు.  వారి దర్యాప్తులో ఈ నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు అని తేలింది.  ఈ విషయాన్ని క్రిమియా దేశ ఇంటర్నల్  అఫైర్స్   మినిస్ట్రీ అధికారికంగా తెలిపింది.  మంత్రిత్వ శాఖ  మరిన్ని వివరాలు తెలుపుతూ ఈ ప్రమాదంపై పోలీసులు త్వరితగతిన దర్యాప్తు  చేస్తున్నట్లు పేర్కొంది.

వీరు నలుగురూ మెడిసిన్ చదువుతున్నారు.  ఇద్దరు మెడిసిన్ మూడో సంవత్సరం విద్యార్థులు కాగా..  మరో ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులు. వీరు నలుగురూ కలిసి రెనాల్ట్ లోగాన్ – సెర్జీవ్– ట్సెన్క్కీ స్ట్రీట్ నుంచి క్రిమియా దేశంలోని సెయింట్ సింఫెరోపోల్ కారులో వస్తున్నారు.  ఈ సమయంలో కారు డ్రైవర్  వాహనం మీద నియంత్రణ కోల్పోయాడు.  దీంతో కారు  నేరుగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది.  ఈ మేరకు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. క్రిమియాలో భారతీయ విద్యార్థులు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. 

Latest Videos

click me!