మద్యం మత్తులో బిల్డింగ్ పైనుంచి ఫీట్... అమెరికాలో ఎన్ఆర్ఐ విద్యార్థి మృతి

ramya Sridhar   | Asianet News
Published : Jan 14, 2020, 01:53 PM ISTUpdated : Jan 14, 2020, 03:22 PM IST
మద్యం మత్తులో బిల్డింగ్ పైనుంచి ఫీట్... అమెరికాలో ఎన్ఆర్ఐ విద్యార్థి మృతి

సారాంశం

స్నేహితులతో కలిసి జనవరి 11వ తేదీ సాయంత్రం తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పై అంతస్తుకి వెళ్లాడు. అనంతరం ఒక బిల్డింగు పై నుంచి మరో బిల్డింగ్ పైకి  వారు దూకడం మొదలుపెట్టారు.

మద్యం మత్తులో బిల్డింగ్ పై నుంచి ఫీట్ చేస్తూ.. కింద పడి ఓ ఎన్ఆర్ఐ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన అమెరికాలోని  ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత సంతతికి చెందిన వివేక్ సుబ్రమణి(23) డ్రెగ్జిల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి జనవరి 11వ తేదీ సాయంత్రం తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పై అంతస్తుకి వెళ్లాడు. అనంతరం ఒక బిల్డింగు పై నుంచి మరో బిల్డింగ్ పైకి  వారు దూకడం మొదలుపెట్టారు.

Also Read అమ్మాయే... అబ్బాయిలా వేషం మార్చి... 50మందిపై అత్యాచారం...

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వివేక్ సుబ్రమణి జారి కిందపడిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో వివేక్ స్నేహితులు కంగుతిన్నారు. వెంటనే అతనిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్ర రక్తస్రావమైంది. దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లినా...అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా... వివేక్ మృతితో అతడి స్నేహితులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

డాక్టర్ కావాలని కలలుకన్న వివేక్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా... ప్రమాద సమయంలో వివేక్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..