నాసా అంతరిక్షయాత్రకు మన హైద్రాబాదీ!

By telugu teamFirst Published Jan 12, 2020, 5:47 PM IST
Highlights

అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష సంస్థ నాసా తన తదుపరి గగన యాత్రకు మన హైద్రాబాదీని సెలెక్ట్ చేసింది. ఈయన ఇప్పటికే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పనిచేస్తున్నారు. 

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష సంస్థ నాసా తన తదుపరి గగన యాత్రకు మన హైద్రాబాదీని సెలెక్ట్ చేసింది. ఈయన ఇప్పటికే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పనిచేస్తున్నారు. 

తదుపరి అంతరిక్ష యాత్రల కోసం నాసా ప్రత్యేకంగా 11 మందికి రెండేళ్లు ప్రాథమిక వ్యోమగామి శిక్షణ ఇచ్చింది. ఈ బృందంలో హైదరాబాద్‌ మూలాలున్న రాజా జాన్‌ ఉరుపుత్తూర్‌ చారి ఒకరు. 

2017లో నాసా ఈ శిక్షణ ప్రారంభమయింది. ఈ శిక్షణలో పాల్గొనేందుకు 18 వేల మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 11 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వారిలో ఒక భారతీయుడు ఉండడం...అతడు మన హైద్రాబాదీ అవడం విశేషంగానే చెప్పవచ్చు. 

Also read: ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు: సున్ని షియాల మధ్య జాతి వైరం దీనికి కారణం

ఇప్పుడు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా భవిష్యత్తులో నాసా చేపట్టబోయే అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములుగా భాగస్వాములు కానున్నారు. ఉరుపుత్తూర్‌ చారి యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో చేరేముందు ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్ లో డిగ్రీలను అందుకున్నాడు. 

ఆయన తండ్రి శ్రీనివాసాచారి ఉన్నత చదువుల కోసం అప్పట్లో హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లారు. అనంతరం అక్కడ మిత్రురాలయిన  పెగ్జితో ప్రేమలో పది ఆమెను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. 

మన చారీ విస్కాన్సిన్ లో పుట్టాడు అయోవా లో పెరిగాడు. అక్కడే విద్యనభ్యసించి ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి పట్టా పొందాడు. అటు తరువాత పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని అమెరికా వాయుసేనలో చేరాడు. ఇరాక్ యుద్ధంలోనూ పాల్గొన్నాడు. 

చారి కూడా అక్కడి యువతీ అయినా హోలీని పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం. 

click me!