మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ వెంటే ఎన్నారైలు

By Siva Kodati  |  First Published Jan 10, 2020, 9:28 PM IST

తెలంగాణలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై టీఆర్ఎస్ యుకే ప్రత్యేక  కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు. 


తెలంగాణలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై టీఆర్ఎస్ యుకే ప్రత్యేక  కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు. 

తెలంగాణ నుంచి వివిధ దేశాల్లో ఎంతో మంది స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని అశోక్ గుర్తుచేశారు.

Latest Videos

undefined

Also Read:అసంతృప్తులకు వల: కేసీఆర్ నో, డైరెక్ట్‌గా బీఫామ్‌తో దిగిన రేవంత్.. టీఆర్ఎస్‌లో కలకలం

అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి కారు అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు ఆయన పిలుపునిచ్చారు. 

ఎన్నికలేవైనా ఎన్నారై టీఆర్ఎస్ సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపు కోసం లండన్ బృందం కృషి చేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు. 

Also Read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

యావత్ భారత దేశంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉన్న రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమేనని అశోక్ చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచామని, కేటీఆర్ అటు మంత్రిగా ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్నారని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలల్లో గులాబీ జెండా ఎగిరేలా  ప్రజలంతా విజ్ఞతతో అలోచించి తెరాస అభ్యర్థులకు ఓటు వేయాలని అశోక్ విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ప్రతిపక్షాలని ఎప్పుడో  మర్చిపోయారని ఎన్నిక ఏదైనా ప్రజలంతా కెసిఆర్ వెంటే ఉన్నారని ఆయన తెలిపారు.

click me!