దుబాయ్ లో జరిగిన ఓ లాటరీ లక్కీ డ్రాలో భారతీయుడుకి రూ. 8.22 కోట్లు దక్కాయి. అయితే అతను ఈ లాటరీటికెట్ ను ఆన్ లైన్ లో కొన్నాడు. కాంటాక్ట్ చేస్తే అతని ఫోన్ కలవడం లేదు.
దుబాయ్ : ఓ భారతీయ వ్యక్తి దుబాయిలో మిలియనీర్ రాఫెల్ లాటరీలో వన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ లాటరీలో జాక్ పాట్ కొట్టాడు. ఇండియన్ కరెన్సీ లో ఈ మొత్తం రూ.8.22 కోట్లు. ఆ భారతీయ వ్యక్తి పేరు సయ్యద్ అలీ బాతుషా తివంశ. ఈ లాటరీలో జాక్ పాట్ కొట్టడంతో రాత్రికి రాత్రే సయ్యద్ అలీ కోటీశ్వరుడు అయిపోయాడు.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ టు దగ్గర బుధవారం నిర్వహించిన లక్కీ డ్రాలో సయ్యద్ అలీకి ఈ జాక్పాట్ దక్కింది. సయ్యద్ అలీ యూఏఈలో ఉంటాడు. ఇతను ఆగస్టు 30వ తేదీన 4392 నెంబర్ గల లాటరీ టికెట్ను ఆన్లైన్ లో కొన్నాడు. సరదాగా కొన్న లాటరీ టికెట్ ఇప్పుడు అతడిని కోటీశ్వరుడిని చేసింది.
undefined
చెన్నైలో మానవ అవయవ అక్రమ వ్యాపారం రాకెట్.. ఆఫ్రికన్‌లతో సహా ఐదుగురి అరెస్ట్...
బుధవారం తీసిన డ్రాలో ఆన్లైన్లో కొన్న టికెట్ కు లాటరీ తగలడంతో నిర్వాహకులు సయ్యద్ అలీ ఫోన్ నెంబర్ కు కాంటాక్ట్ చేశారు. కానీ, అతని నెంబర్ కలవలేదు. దీంతో అతనిని కాంటాక్ట్ చేయడానికి వేరే మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులు ఈ మేరకు తెలిపారు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ 1999లో ప్రారంభమైంది. ఈ టికెట్ల కొనుగోలులో ఇప్పటివరకు ఒక మిలియన్ డాలర్ గెలుచుకున్న భారతీయుల్లో సయ్యద్ అలీ 25వ వ్యక్తిగా నిర్వాహకులు తెలిపారు. ఈ లాటరీ టికెట్ను కొనుగోలు చేసేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని నిర్వాహకులు చెబుతున్నారు.