గ్రాడ్యుయేట్ విద్యార్థి జాహ్నవి కందుల మృతి సమయంలో నవ్వుతూ, హేళనగా మాట్లాడిన పోలీసు అధికారి వీడియో వెలుగు చూసింది. సదరు ఆఫీసర్ మీద దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు.
అమెరికా : ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని ఓ భారతీయ సంతతికి చెందిన మహిళ అమెరికాలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి.. ఓ పోలీసు అధికారి నవ్వుతూ, హేళనగా మాట్లాడటం అతని బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో సీటెల్ పోలీసు యూనియన్ లీడర్లపై దర్యాప్తు ప్రారంభించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
సోమవారం విడుదల చేసిన ఈ వీడియోలో, ఆఫీసర్ డేనియల్ ఆడెరర్ జనవరి 23న తన సహోద్యోగి, ఆఫీసర్ కెవిన్ డేవ్ పెట్రోలింగ్ వాహనంతో హత్యకు గురైన గ్రాడ్యుయేట్ విద్యార్థి జాహ్నవి కందుల మృతికి సంబంధించిన ప్రమాద దర్యాప్తు గురించి చర్చిస్తున్నట్లు వినిపిస్తుంది. 23 ఏళ్ల జాహ్నవి కందుల నార్తీస్ట్రన్ విశ్వవిద్యాలయం, సీటెల్ క్యాంపస్‌లో మాస్టర్స్ విద్యార్థి.
undefined
ఫ్లైట్‌లో టాయిలెట్‌లో శృంగారం.. డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్
క్లిప్‌లో, సీటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరర్, గిల్డ్ ప్రెసిడెంట్‌తో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఆయన నవ్వుతూ, మృతురాలి గురించి మేళనగా మాట్లాడారు. ఆమె ఒక "సాధారణ వ్యక్తి" అని, ః"ఆమె చనిపోయింది" అని చెప్పడం వినిపిస్తుంది. దీంతోపాటు నవ్వుతూ, పదకొండు వేల డాలర్లకు ఒక చెక్కు రాయండి" అనడం వినిపిస్తుంది.
క్లిప్ లో చివరకు అతను అన్న మాటలు మరింత విషాదకరంగా ఉన్నాయి.. "ఆమెకు 26 సంవత్సరాలే, ఆమె విలువ పరిమితమే’’ అనడం షాకింగ్ కు గురి చేస్తుంది. సీటెల్ కమ్యూనిటీ పోలీస్ కమీషన్ వీడియో విడుదలైన తర్వాత సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది, ఆడెరర్, అతని సహోద్యోగి మధ్య జరిగిన సంభాషణ "హృదయ విదారకమైనది, దిగ్భ్రాంతికరమైనది" అని పేర్కొంది.
''సమాజంలో విశ్వాసాన్ని పెంపొందించడం, ప్రజా భద్రతకు భరోసా కల్పించే బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉండడానికి సీటెల్ ప్రజలు అర్హులు’’ అని రాశారు. ఇందులో భాగంగానే "పారదర్శకత కోసం"
సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ వీడియోను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి సౌత్ లేక్ యూనియన్‌లో సియాటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించింది, జాహ్నవి కందుల సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థిని. ఈ డిసెంబర్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకునేది.