బ్రిటన్ ఎంపీలు ప్రశంసించారన్నది బీఆర్ఎస్ అసత్య ప్రచారం: టీపీసీసీ ఎన్నారై సెల్

By Mahesh KFirst Published May 11, 2023, 7:02 PM IST
Highlights

కేసీఆర్ దళితుల లబ్దికి పాటుపడుతున్నాడని బ్రిటన్ ఎంపీలు కూడా పొగిడారని వార్తలు వచ్చాయని, అవి అసత్యాలని టీపీసీసీ ఎన్నారై సెల్ పేర్కొంది. అలా అసత్య ప్రచారం చేసి బ్రిటన్ ఎంపీలను, భారతీయులను బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించింది.
 

హైదరాబాద్: కేసీఆర్ పాలనాదక్షతను, దళితుల సంక్షేమానికి కేసీఆర్ పాటుపడుతున్న విధంపై బ్రిటన్ ఎంపీలు సైతం ముగ్దులయ్యారని వార్తలు వచ్చిన విషయం విధితమే. కానీ, అదంతా అసత్య ప్రచారం అని టీపీసీసీ ఎన్నారై సెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బ్రిటన్ ఎంపీలనూ బీఆర్ఎస్ మోసపుచ్చిందని వివరించింది. డాక్టర్ అంబేద్కర్ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి  ముగ్గురు బ్రిటన్ ఎంపీలు నవీందు మిశ్రా, కుల్దీప్ సింగ్ సహోట, వీరేంద్ర శర్మలను ఆహ్వానించారు. అంబేద్కర్‌కు ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు ఉన్నాయి. ఆయనపై అభిమానమూ, గౌరవమూ ఎక్కువే. అందుకే ఆయన పేరిట సమావేశం అనగానే సహజంగానే ఎవరికైనా ఆసక్తి ఉంటుందని టీపీసీసీ ఎన్నారై సెల్ పేర్కొంది. అలా వచ్చిన ఆ బ్రిటన్ ఎంపీలను బీఆర్ఎస్ తప్పుగా ప్రచారం చేసిందని ఆరోపించింది.

ఇందుకు సంబంధించిన వాస్తవాలను, బీఆర్ఎస్ పార్టీ కుట్రను లేఖ ద్వారా ఆ ముగ్గురు ఎంపీల దృష్టికి తీసుకెళ్లినట్టు టీపీసీసీ ఎన్నారై సెల్ పేర్కొంది. రాజ్యాంగ నిర్మాత, దేశ ప్రజాస్వామ్యానికి సూచిక, అంబేద్కర్ గురించి, ఆయన ఆశయ సాధన, స్ఫూర్తి చైతన్యం గురించి మాట్లాడకుండా.. ఓట్ల లబ్ది కోసం తెచ్చిన కనికట్టు పథకం గురించి, అంబేద్కర్ భావజాలం, స్ఫూర్తి, ఆత్మ లేని విగ్రహం గురించి మాట్లాడి బ్రిటన్ ఎంపీలను, భారతీయులనూ మోసం చేసిందని ఆరోపించింది.

Also Read: ‘సీఎం పదవి వరించి రావాలి’.. ముఖ్యమంత్రి పదవిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టత.. ‘పొత్తులకు ఆ కండీషన్ లేదు’

ఆ ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ దళితులను మోసం చేసిందని, అందుకు సంబంధించిన కొన్ని ఆరోపణలనూ ఎన్నారై విభాగం ప్రస్తావించింది. దళితుడిని సీఎం చేస్తానని రెండు సార్లు అధికారంలోకి వచ్చినా చేయలేదని, మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామని చెప్పి మోసం చేసిందని పేర్కొంది. రాజ్యాంగాన్నే మారుస్తామని ప్రగల్భాలు పలికారని, ధరణి పేరిట దళితుల భూములను లాక్కున్నారని తెలిపింది.  ఎస్సీ సబ్ ప్లాన్ నిధులకు కోత పెట్టి, అందులో కేవలం 8 శాతం నిదులనే దళిత బంధు కింద అమలు చేస్తున్నదని ఆరోపించింది.

కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినప్పటికీ తొలి రోజు నుంచే ప్రతిపక్షాలను రానీయకపోవడం, రానీయం అని నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మంత్రులు మాట్లాడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ తెలిపారు.

click me!