అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డాడు. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థితో సహా 14 మంది మృతి చెందారు.
అమెరికా : అగ్రరాజ్యం అమెరికాలో వరస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో తెలుగు విద్యార్థులు మరణించడం విషాదాన్ని నింపుతుంది. వరుస తుపాకీ మోతలతో కాలిఫోర్నియా రాష్ట్రం దద్దరిల్లిపోతుంది. కాలిఫోర్నియాలోని మాంటేరరి పార్కులో శనివారం జరిగిన విషాద ఘటన మరువకముందే.. మరోసారి కాల్పుల ఘటన అలజడి సృష్టించాయి. ఈసారి ఉత్తర కాలిఫోర్నియా సమీపంలో ఉన్న హాఫ్ మూన్ బే నగరంలో కాల్పులు జరిగాయి. ఇక్కడి రెండు వ్యవసాయ వ్యాపార ప్రదేశాల్లో దుండగులు కాల్పులు జరపడంతో మొత్తం 14 మంది మరణించారు.
ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తున్న చున్లీ జావ్ (67)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అంతకుముందు చికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మరణించాడు. చైనా లూనార్ కొత్త సంవత్సర వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మరువకముందే కాలిఫోర్నియాలోని వేరువేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలు భయాందోళనకు గురిచేసాయి. ఈ ఘటనలో మొత్తం 14 మంది మృతి చెందారు.
undefined
అమెరికా చికాగోలో కాల్పులు: విజయవాడ విద్యార్ధి దేవాన్ష్ మృతి, హైద్రాబాద్ విద్యార్ధికి గాయాలు
ఉత్తర కాలిఫోర్నియాలోని ఆఫ్ మూన్ బే ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలోచున్లీ జావ్ (67) అనే ఓ చైనా జాతీయడైన వ్యవసాయ కార్మికుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. తోటి కార్మికులపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోతూ మరోసారి కాల్పులు జరిపాడు. మరొకటనలో అయోగనగరంలోని డేస్ నైస్ లో దుండగుడి కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. అయోవా రాష్ట్రంలోని డెస్ మోయిన్ నగరంలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.