ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ

Published : Oct 26, 2017, 04:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ

సారాంశం

ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ చేపడతామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజ మోహన్ రెడ్డి చెప్పారు. వైసీపీ బలోపేతం కోసం ప్రత్యేకంగా జిల్లాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు

ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ చేపడతామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజ మోహన్ రెడ్డి చెప్పారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ పాదయాత్ర విశేషాల గురించి వివరించారు.ఈ పాదయాత్రలో భాగంగానే   ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ చేస్తామన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని.. అది ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్యాకేజీ వల్ల ఏవిధంగా లబ్ధి చేకూరుతుందో మనకు తెలియదని.. కాబట్టి ప్రత్యేక హోదానే కావాలన్నారు.రాష్ట్ర ప్రజల హక్కులను చంద్రబు కాలరాశారని ఆయన ఆరోపించారు.  హోదా వచ్చినట్లయితే.. రాష్ట్రం అభివృద్ధి సాధించి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. వైసీపీ బలోపేతం కోసం ప్రత్యేకంగా జిల్లాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నాలుగు నెలల్లో  ఎమ్మెల్యే,నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు గడపగడపకి తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటారని చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీదా ఉందని మేకపాటి అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు చేస్తున్న అప్రజాస్వామిక విధానాలనూ ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీదా ఉందన్నారు.జగన్ చేయబోతున్న పాదయాత్ర విజయవంతం కావాలని మేకపాటి ఆకాంక్షించారు. జగన్ కి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !