గేట్స్ కోసం రూ.కోట్ల ఖర్చా?

Published : Nov 18, 2017, 03:29 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
గేట్స్ కోసం రూ.కోట్ల ఖర్చా?

సారాంశం

బిల్‌గేట్స్‌ కోసమే చంద్రబాబు అగ్రిటెక్ సదస్సు ఏర్పాటు చేశారన్న వైసీపీ నేత నాలుగు రోజుల్లో రూ.40కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపణ రైతులకు ఒరిగిందేమీ లేదన్న వైసీపీ

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ తో ఫోటోలు దిగేందుకు ప్రభుత్వాధినేతలు కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అగ్రిటెక్ సదస్సు పేరుతో రైతులను మరోసారి మభ్యపెట్టారన్నారు. ప్రచారాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని అమర్నాథ్ ఆరోపించారు. బిల్‌గేట్స్‌ కోసమే చంద్రబాబు అగ్రిటెక్ సదస్సు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఈవెంట్ల పేరుతో నాలుగు రోజుల్లో రూ.40కోట్లు ఖర్చుపెట్టారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి సీఎంలాగా కాకుండా  ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అగ్రిటెక్ సదస్సు వల్ల రైతులకు  ఒరిగిందేమీ లేదన్నారు. అలాంటప్పుడు ఎవరి కోసం ఈ సదస్సులు నిర్వహించారంటూ ప్రశ్నించారు. కనీసం రైతులకు ఉపయోగపడే ఒక్క తీర్మానం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను అసలు పట్టించుకోవడంలేదన్నారు. విశాఖకి ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. ఒటమి భయంతోనే విశాఖలో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించలేదన్నారు.     

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu