మళ్లీ తగ్గిన రెడ్ మీ నోట్4 ధర

Published : Jan 24, 2018, 01:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
మళ్లీ తగ్గిన రెడ్ మీ నోట్4 ధర

సారాంశం

మరోసారి తగ్గిన రెడ్ మీ నోట్ 4 ధర రూ.10,999కి చేరిన రెడ్ మీ నోట్ 4 ధర

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ షియోమి.. వినియోగదారుల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతేడాది భారత్ లో విరివిగా అమ్ముడైన రెడ్ మీ నోట్ 4 ఫోన్ ధర తగ్గించింది. 64జీబీ వేరియంట్ రెడ్ మీ నోట్ 4 ఫోన్ మీద మాత్రమే ధర తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. గతంలోనూ ఒకసారి ఈ ఫోన్ ధర తగ్గించగా.. ఇప్పుడు మరోసారి తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.వెయ్యి తగ్గించగా.. ఫోన్ ధర రూ.10,999కి చేరింది.  ధర తగ్గిన రెడ్ మీ నోట్ 4 ఈ-కామర్స్ వెబ్ సైట్స్ అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లలో లభ్యం అవుతున్నాయి. ఈ ఫోన్ ని తొలుత విడుదల చేసిన సమయంలోనూ, మొదటిసారి ధర తగ్గినప్పుడూ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తాజాగా మరో రూ.1000 తగ్గించడంతో మరింత ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.

రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు..

5.50 ఇంచెస్ టచ్ స్క్రీన్

4జీబీ ర్యామ్

64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ

ఫ్రంట్ కెమేరా 5మెగా పిక్సెల్

వెనుక కెమేరా 13మెగా పిక్సెల్

ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu