భారత మార్కెట్లో రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

First Published Dec 3, 2017, 10:01 AM IST
Highlights
  • ఈ వారం భారత మార్కెట్ లోకి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు అడుగుపెట్టాయి.
  • రెండూ బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు ఈ రెండు మధ్య పోటీ ఏర్పడింది.

ఈ వారం భారత మార్కెట్ లోకి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు అడుగుపెట్టాయి. రెండూ బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు ఈ రెండు మధ్య పోటీ ఏర్పడింది. ఆ రెండు ఫోన్లు ఏమిటి..? వాటి ఫీచర్లు ఏమిటి..? రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ  షియోమి భారత మార్కెట్ లోకి  గురువారం కొత్త మోడల్ ఫోన్ ని ప్రవేశపెట్టింది.  ‘దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌’ పేరుతో ‘రెడ్‌మి 5ఏ’ మొబైల్‌ను రూ.5వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫోన్ ధర, ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. ‘‘స్మార్ట్‌ ఫోన్‌ ఇండస్ట్రీ చరిత్రలో షియోమి ఇండియా ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనుంది. అందులో భాగంగానే తొలి 50లక్షల రెడ్‌మి 5ఏ(2జీబీ+16బీజీ)ను రూ.4,999కే అందించనున్నాం’’ అని రెడ్‌మి ఇండియా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. డిసెంబర్‌ 7 మధ్యాహ్నం 12గంటలకు ఫ్లిప్‌కార్ట్‌ లో తొలి సేల్‌ ప్రారంభం కానుంది.

ఈ దేశ్ కా స్మార్ట్ ఫోన్ విడుదలైన మరుసటి రోజే మైక్రోమ్యాక్స్ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్  భరత్5 పేరిట ఈ ఫోన్ ని రూ.5,555కే అందిస్తోంది.

రెడ్ మీ 5ఏ ఫోన్ ఫీచర్లు..

5 అంగుళాల హెచ్‌డీ టచ్ స్క్రీన్ 
స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌ 
 2జీబీ ర్యామ్‌ 
16జీబీ అంతర్గత మెమొరీ
5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా

13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 
ఆండ్రాయిడ్‌ నోగట్‌, ఎంఐయూఐ 9 వెర్షన్‌ 
మెమొరీకార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్‌ 
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

 

మైక్రోమ్యాక్స్ భరత్5 ఫోన్ ఫీచర్లు..

5.2  ఇంచెస్ టచ్ స్క్రీన్

1.3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్

1జీబీ ర్యామ్

16జీబీ స్టోరేజీ స్పేస్

మెమొరీ కార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్

5మెగా పిక్సెల్ ముందు కెమేరౌ

5మెగా పిక్సెల్ వెనుక కెమేరా

5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

ఆండ్రాయిడ్‌ నోగట్‌, ఎంఐయూఐ 9 వెర్షన్‌ 

 

 

 

click me!