మార్చి14న రెడ్ మీ కొత్త ఫోన్

Published : Mar 11, 2018, 10:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
మార్చి14న రెడ్ మీ కొత్త ఫోన్

సారాంశం

షియోమి నుంచి మరో కొత్త ఫోన్ మార్చి 14న భారత మార్కెట్లోకి

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ తయారీ సంస్థ షియోమీ భారత్‌ మార్కెట్లో మరో మోడల్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వారం ప్రముఖ ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో రెడ్‌మి 5 మొబైల్‌ను‌ ఎక్స్‌ క్లూజివ్‌గా విడుదల చేయబోతున్నారు. మరోవైపు షియోమీ తన వెబ్‌సైట్లో ఈ ఫోనుకు సంబంధించిన ఫీచర్స్‌ ను తెలిపేలా ‘కాంపాక్ట్  పవర్‌హౌస్‌’ అంటూ ఓ ఫొటోలో పేర్కొంది. ఇక అమెజాన్‌లో మార్చి 14న ఈ ఫోన్‌ విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం రెడ్‌మి 5 ఫీచర్స్‌ ఇలా ఉండే అవకాశం ఉంది. 5.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్ ప్లే,  స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌, 2జీబీ/ 3జీబీ/ 4జీబీ ర్యామ్‌,  16జీబీ లేదా 32జీబీ  ఇంటర్నల్ మెమొరీతో విడుదల చేసే అవకాశం ఉంది. వెనక వైపు 12ఎంపీ కెమెరా, ముందు వైపు 5 ఎంపీ కెమెరా అమర్చారు. 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సదుపాయం కలదు.  దీని ధర కూడా బడ్జెట్ ధరలో ఉండనుంది. రూ.9వేల లోపే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu