మరోసారి ఫ్యాన్ ఫెస్టివల్ ప్రకటించిన షియోమి

First Published 5, Apr 2018, 12:40 PM IST
Highlights
రెడ్ మీ ఫోన్లు, ఎంఐ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను ఆఫర్ చేస్తూ.. కష్టమర్లను ఆకర్షిస్తోంది. మొన్నటివరకు కేవలం స్మార్ట్ ఫోన్లను మాత్రమే అందించిన షియోమి.. ఇటీవలే టీవీలను అందిస్తోంది. ఇదిలా ఉండగా.. షియోమి  ఇండియా ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఇవాళ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2018 సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు షియోమీ ఉత్పత్తులపై వినియోగదారులకు ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి. రెడ్‌మీ నోట్ 5 ప్రొ, రెడ్‌మీ నోట్ 5, రెడ్‌మీ 5, ఎంఐ మిక్స్ 2, ఎంఐ మ్యాక్స్ 2, రెడ్‌మీ 4, రెడ్‌మీ వై1, వై1 లైట్, రెడ్‌మీ 5ఎ ఫోన్లపై ఈ సేల్‌లో ఆఫర్లు లభిస్తున్నాయి. అలాగే ఎంఐ బ్యాండ్, ఎంఐ ఇయర్‌ఫోన్స్, ఎంఐ బ్యాక్‌ప్యాక్‌లు తక్కువ ధరలకే లభిస్తున్నాయి. సేల్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ ఫోన్‌ను కొన్నవారికి ఉచితంగా ఎంఐ ఇయర్‌ఫోన్స్‌ను అందిస్తున్నారు. ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి షియోమీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే అదనంగా క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తున్నారు. ఈ సేల్ కేవలం రేపటి వరకు మాత్రమే కొనసాగుతుంది. 

Last Updated 5, Apr 2018, 12:40 PM IST