బాబుకు ప్రధాని అప్పాయంట్ మెంట్ దొరికేనా?

First Published Dec 30, 2017, 12:07 PM IST
Highlights

మరొక వైపు వైసిపితో నేతలతో ప్రధాని సమావేశాలు చక్కగా సాగుతున్నాయి.

తెలుగుదేశంలో ఒక ఆసక్తి కరమయిన చర్చ జరుగుతూ ఉంది.

కనీసం కొత్త సంవత్సరంలోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని మోదీ తో అప్పాయంట్ మెంట్ దొరుకుతుందా?

ప్రధాని జనవరిలో విశాఖ వచ్చి పెట్రోలియం యూనివర్శిటీ శంకుస్థాపన చేస్తారా? అనేది ఆచర్చ.

 

 

ఎందుకంటే, వాళ్లిద్దరు కలసి తీరుబడి రాష్ట్రా భివృద్ధి గురించి లేదా రాష్ట్ర ప్రాజక్టుల గురించి మాట్లాడక దాదాపు ఒకటిన్నర సంవత్సరమయింది.  బహుశా వాళ్లిద్దరు కలివిడిగా ఉండి ఒకరినొకరు పైకి (లోపల ఎలా ఉన్నా) ప్రశంసించుకున్నది రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంలోనే. ఆతర్వాత జూన్ 19న ప్రధాని ముఖ్యమంత్రి కి ఫోన్ చేసి రాష్ట్ర పతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ కు మద్దతునీయాలని కోరారు.

అంతే, అప్పటినుంచి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి సంబంధాల గురించి రకరకాల కథనాలు కనబడుతున్నాయి. వాళ్లిద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయని, రాజధాని, పోలవరం వ్యవహారాలలో ముఖ్యమంత్రి దోరణి కేంద్రానికి నచ్చడం లేదని, బిజెపి,టిడిపి కలసి ఉండటం కష్టమని... ఇలా రకరకాల కథనాలు వినపడ్డాయి. ఇది నిజమా అన్నట్లు ప్రధానితో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు ఆగిపోయాయి. రాజధానిలో ఉన్నా ప్రధానితో సమావేశం ఏర్పాటుచేసేందుకు ప్రధాని కార్యాలయం ‘ప్రధాని బిజి’ అనే పేరుతో తిరస్కరించేది. ముఖ్యంగా మొన్న సెప్టెంబర్ లో  25, 26 తేదీలలో చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. సెప్టెంబర్ 25 ప్రధాని అప్పాయంట్ మెంట్ అడిగారు. ప్రధాని కార్యాలయం పట్టించుకోలేదు. సెప్టెంబర్ 26న మళ్లీ గుర్తు చేశారు. అప్పాయంట్ మెంట్ రాలేదు. చివరకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం కోరారు. అదీ జరగలేదు.

మరో వైపు  ఢిల్లీలో ప్రధాని వైసిపి నేతలతో బాగా సమావేశం అవుతున్నారు.  2017 మేలోప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని నికలిశారు.  మొన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో సమావేశమయ్యారు.

ఇది టిడిపిలో ఇబ్బందిగా తయారయింది. ఈ లోపు మొన్న ఆగస్టు నాలుగో తేదీన విశాఖ లో  ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియమ్ అండ్ ఎనర్జీ (ఐఐపిఇ)కు సంబంధించిన బిల్లు పాసయింది. ఇది ప్రతిష్టాత్మకమయిన బిల్లు. రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమి ఇస్తే, కేంద్రం రు.650 కోట్ల నిధి ఇచ్చింది. ఖరగ్ పూర్ ఐఐటి ఈ సంస్థను పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఈ సంస్థ శంకుస్థాపనకు ప్రధాని రావాలి. ఇది రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హమీ కూడా. ఈ ఇన్ స్టిట్యూట్ శంకుస్థాపనకు రావడం ప్రధానికి  రాజకీయంగా కూడా చాలా అవసరం. ఎందుకంటే, ఆలస్యంగా నైనా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజలకు వివరణ ఇచ్చేందుకు వీలవుతుంది. అది ఆంధ్ర బిజెపికి కూడా పనికొస్తుంది.

ఈ మధ్య  ఈ విషయం మీద తెలుగుదేశం ఎంపిలు పార్లమెంటులో కలసి విశాఖ ఆహ్వానించినపుడు ప్రధాని సుముఖంగా స్పందించారని చెబుతున్నారు.

అయితే, చాలా మంది తెలుగుదేశం నేతలను అనుమానం పీడిస్తూనే ఉంది. మోదీ నిజంగా విశాఖ వస్తారా... లేక వచ్చినట్లే వచ్చి వెళతారా. ఎందుకంటే, గుజరాత్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సులో ముఖమంత్రికి ఒక నమస్కారం పెట్టేందుకు మాత్రమే మోదీ అవకాశమిచ్చారు. ముఖా ముఖి సమావేశంజరగనే లేదు. విశాఖ మీటింగ్ కూడా అలాగే ఉంటుందా లేక  ఇద్దరు కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడుకుంటారా?

ఇది తెలుగుదేశం పార్టీకి 2017  మిగిలించిపోతున్న చిక్కు ప్రశ్న.

 

 

click me!