ఆ జవాన్లను చంపింది మహిళలేనట

First Published Apr 25, 2017, 12:20 PM IST
Highlights

దాడిచేసిన గెరిల్లా దళంలో 70 శాతం మంది మహిళా మావోలు

సుకమాలో నిన్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఏడేళ్ల లో మావోయిస్టులు చేసిన అతి పెద్ద దాడి ఇదే అని తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 25 మంది జవాన్లను మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

 

జవాన్లపై ప్రతికారం తీర్చుకునేందుకే మావోలు పక్కా ప్లాన్ తో ఈ ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది.రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా భద్రత కోసం వచ్చిన జవాన్లను మాటు వేసి మావోలు హతమర్చారు.

 

ఈ సారి మావోల ఎత్తుగడను పసిగట్టడంలో జవాన్లు విఫలమయ్యారు. దీంతో వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ముఖ్యంగా జవాన్లపై దాడికి పాల్పడిన మావోయిస్టుల్లో 70 శాతం మంది మహిళలే ఉన్నట్లు గాయపడిన వారు చెబుతున్నారు.

 

గస్తీ నిర్వహిస్తున్న సమయంలో జవాన్లు అందరూ మూకుమ్మడిగా కాకుండా కాస్త దూరం దూరంగానే ఉంటారు. దీంతో ఇదే అదునుగా భావించి మావోయిస్టులు ప్రతికార దాడులకు దిగారు. గెరిల్లా తరహా దాడికి పాల్పడిన మావోదళంలో వెయ్యిమంది వరకు ఉన్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు భావిస్తున్నారు.

 

నల్లదుస్తులు ధరించి, ఏకే-47 వంటి అధునాతన ఆయుధాలతో మహిళలే దాడికి దిగడంతో తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతంలోనూ మావోలు రాకెట్ లాంచర్లతో దాడులకు దిగారు. ఇప్పుడు మహిళ లతో గెరిల్లా దళాలు ఏర్పాటు చేసి కొత్త తరహా దాడులకు దిగుతున్నారు.

click me!