మహిళా హక్కులపై... తన్నుకోవడమొక్కటే తక్కువ

First Published Mar 21, 2017, 5:36 AM IST
Highlights

మహిళా హక్కుల గురించి  రణరంగమయిన  ఆంధ్ర అసెంబ్లీ మీడియా పాయింట్

అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ యుద్ధభూమి అయిపోయింది. మహిళల మీద అఘాయిత్యాలుజరుగుతున్నాయని, తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అరికట్టడంతోఘోరంగా విఫలమయిందని వైసిపి సభ్యులు ఆరోపిస్తే, జగన్ ముద్దు రాజకీయాలు చేస్తున్నాడని తెలుగుదేశం సభ్యులు పాత ట్విస్టుతో తలపడ్డారు. 

 

ఇరు వర్గాలు ఒకేసారి మీడియాతో మాట్లాడాలనుకోవడం, వాగ్వాదానికి దిగడంతో చాలా సేపు మీడియా పాయింట్ దగ్గిర గందరగోళం ఏర్పడింది. చివర, పోలీసులు వచ్చి వైసిసిఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని అక్కడి నుంచి పంపించేశారు.‘ నాకు మాట్లాడే హక్కుంది. హక్కును కాల రాస్తున్నారంటూ,’అమె విమర్శించారు. అసెంబ్లీలో నిబంధనలను టీడీపీ కాలరాస్తున్నదని అక్రమ కేసులతో తమ పార్టీ నేతలను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

 

సరిగ్గా అపుడే  అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనిత,మంత్రి పీతల సుజాత ఆమెపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని వారు ప్రత్యారోపణ చేశారు.

 

రెండు పార్టీల నేతలు పోటాపోటీగా వాదులాడుకున్నారు. మైకులు లాక్కున్నారు. ఘర్షణ కు దిగారు. అరుపులు, కేకలు. నిజానికి  తన్నుకోవడం ఒక్కటే తక్కువయింది.పోలీసులు నచ్చజెప్పుతున్నా ఎవరూ శాంతించలేదు.

 

 గిడ్డి ఈశ్వరి అవతలిపక్షం మీద నిప్పులు చిమ్ముతూ సీఎం తల నరకాలనే మాట తాను ఎపుడూ అనలేదని, అన్నట్లు నిరూపిస్తే రాజీనామాకైనా రెడీ అని చాలెంజ్ చేశారు. ఈ

 

వాగ్యుద్ధం  ముదురుతూండటంతో మార్షల్స్ వచ్చి  గిడ్డి ఈశ్వరిని మార్షల్స్ బలవంతంగా పక్కకు తీసుకువెళ్లారు.

 

click me!