స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు?

First Published Jan 30, 2018, 3:20 PM IST
Highlights

భారతదేశపు మొదటి బడ్జెట్ ఏడున్నర నెలలకే ప్రవేశపెట్టారు

స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్ వివరాలు

స్వాతంత్య్రం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది అప్పటి ఆర్థిక మంత్రి ఆర్ కె షణ్ముగం చెట్టి. ఈ బడ్జెట్ ను కేవలం ఏడున్నర  నెలల కాలానికే ప్రవేశపెట్టారు. అంటే ఆగస్టు 15,1947 నుంచి మార్చి 31, 1948 కాలానికేనన్నమాట. బడ్జెట్ అంచనాల ప్రకారం అప్పటి ప్రభుత్వాదాయం (రెవిన్యూ) కేవలం రు 171 కోట్లు.ద్రవ్యలో టు (ఫిస్కల్ డెఫిషిట్ ) కూడా చాలా తక్కువ. అది కేవలం రు. 24.59 కోట్లే.

భారతదేశం విడిపోయాక, న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లలో రెండు వేర్వేరు ప్రభుత్వాలొచ్చాయి. అంతకు ముందు మార్చిలో 1947-1948 ఒక బడ్జెట్ పాసయి ఉండింది. ఈరెండు ప్రభుత్వాలు ఉనికి లోకి రాగానే,ఈ బడ్జెట్ రద్దయింది.అపుడు ఆర్థిక మంత్రి షణ్ముగం చెట్టి నవంబర్ 26,1947న ఏడున్నర నెలలకాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఇది పూర్తిగా దేశ విభజన వల్ల వచ్చిన సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇందులో ప్రధానమైన అంశాలు: అహార ధాన్యాల ఉత్పాదకత, రక్షణ సర్వీసులు, ప్రజావసరాలు. అపుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా తక్కువగా ఉండింది. అందువల్ల ఆహారోత్పత్తి స్వావలంభన (సెల్ఫ్ సఫిషియన్సీ)సాధించాలన్నదే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించారు. రు. ప్రభుత్వ రాబడి 171 కోట్ల లో రు. 15.9 కోట్లు తంతి తపాలా శాఖ నుంచి వస్తాయని భావించారు. రెవిన్యూ ఎక్స్ పెండిచర్  రు. 197 కోట్లు. ఇందులో రక్షణ వ్యయం రు.92.74 కోట్లు.

(ఫోటో క్రెడిట్స్ @IndiaHistorypic)

click me!