వాట్సాప్ కొత్త ఫీచర్: డేటా సేవ్.. మెమరీ సేవ్..!

First Published Jun 28, 2018, 10:53 AM IST
Highlights

వాట్సాప్ కొత్త ఫీచర్: డేటా సేవ్.. మెమరీ సేవ్..!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ వాట్సాప్‌లో మనకి వివిధ వ్యక్తులు లేగా వాట్సాప్ గ్రూపుల నుంచి వచ్చే ఫొటోలు లేదా వీడియోలు నేరుగా ఫోన్‌లోని ఫొటో గ్యాలరీలో స్టోర్ అయ్యేవి. ఫలితంగా ఫోన్ స్టోరేజ్ తగ్గిపోవడమే కాకుండా అవసరం లేని ఫొటోలు, వీడియోలు కూడా ఫోన్‌లో సేవ్ అవుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ అసౌకర్యం తొలగిపోనుంది.

ఇందు కోసం వాట్సాప్ అప్లికేషన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు. ఈ మార్పుల వలన ఇప్పుడు వాట్సాప్‌లో వచ్చే ఫొటోలు, వీడియోలు మనం కావాలనుకుంటేనే గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు లేదంటే కేవలం వాట్సాప్ అప్లికేషన్‌లో ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వలన ఫోన్‌లో స్టోరేజ్ మెమరీ ఆదా అవటమే కాకుండా నెట్‌వర్క్ డేటా కూడా ఆదా అవుతుంది.

వాట్సాప్‌లో ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం బీటా వెర్షన్ 2.18.159లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ మార్పు ఇతర యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే ఫోన్‌ కాంటాక్ట్‌ లేదా గ్రూప్‌ల ఇన్ఫోలోకి వెళ్లి, మీడియా డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను తొలగించాల్సి ఉంటుంది.

వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్:
వాట్సాప్‌లో ఇప్పటికే ఆడియో కాల్, వీడియో కాల్ సౌకర్యాలున్న సంగతి మనందరికీ తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఇందులో గ్రూప్ కాలింగ్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం బీటా వినియోగదారులకు మాత్రమే లభిస్తోంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

click me!