వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్

First Published Jan 11, 2018, 11:16 AM IST
Highlights
  • వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది
  • ఇంతకీ ఆ ఫీచర్ ఎంటో తెలుసా..?

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే పలు ఫీచర్లను పరిచయం చేయగా.. తాజాగా మరో ఫీచర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.  ఇంతకీ ఆ ఫీచర్ ఎంటో తెలుసా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

ఇప్పటివరకు మీరు వాట్సాప్ నుంచి వాయిస్ కాల్స్ చేసుంటారు.. అదేవిధంగా వీడియో కాల్స్ కూడా చేసి ఉంటారు. అవునా.  అయితే.. ఎప్పుడైనా వాయిస్ కాల్ మాట్లాడుతూ.. దానిని వీడియో కాల్ గా మార్చారా..? అలాంటి సదుపాయాన్నే ఇప్పుడు వాట్సాప్ మన ముందుకు తీసుకవచ్చింది. వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు.. అవతల వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడలని అనిపించింది అనుకోండి.. ఈ కాల్ కట్ చేసి.. మళ్లీ వీడియో కాల్ చేయాలి. కానీ.. ఇప్పుడు అవసరం లేదు. వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడే.. కావాలంటే వీడియో కాల్ లోకి మారచ్చు.

ఇప్పటికే ఈ ఫీచర్ ని బీటా వర్షన్ లో విడుదల చేశారు. వాయిస్‌ కాల్‌ మాట్లాడుతుండగా, కేవలం స్విచ్‌ అనే బటన్‌ను ట్యాప్‌ చేయటం ద్వారా వీడియో కాల్‌కు మారవచ్చు. అయితే వీడియోకాల్‌కు మారే బటన్‌ ట్యాప్‌ చేయగానే అవతలి వ్యక్తికి రిక్వెస్ట్‌ వెళుతుంది. ఆ వ్యక్తి వీడియోకాల్‌కు మారాలనుకుంటే రిక్వెస్ట్‌ కు అనుమతి ఇస్తే సరిపోతుంది. ఒక వేళ తిరస్కరిస్తే వాయిస్‌కాల్‌ కొనసాగుతుంది. అంతేకాకుండా.. త్వరలోనే వాట్సాప్ లో గ్రూప్ కాల్ ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

click me!