ఇక వాట్సాప్ లో ‘‘ఫేక్ ’’న్యూస్ కనిపెట్టేయచ్చు

First Published Jan 17, 2018, 5:05 PM IST
Highlights
  • ఫేక్  న్యూస్ లకు చెక్ పెడుతున్న వాట్సాప్

‘‘సోషల్ మీడియా’’ దీని గురించి ప్రస్తుత కాలంలో తెలియని వాళ్లు అరుదు. దీని వల్ల లాభాలు ఎన్నున్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే.. నిమిషాల్లో అది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతోంది ఈ సోషల్ మీడియా కారణంగానే. అయితే.. ఇదే సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ లు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లో.. ఎవరో ఒకరు ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి.. ఓ నలుగురికి పంపితే.. ఒకరి దగ్గర నుంచి మరొకరికి అలా లక్షల మంది సర్క్యూలేట్ అవేతున్నాయి. మనకు వచ్చే న్యూస్ లలో ఏది నిజమైనదో.. ఏది ఫేక్ న్యూసో తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. అయితే.. ఇక ముందు ఇలాంటి సమస్య ఉండదు అంటోంది వాట్సాప్.

వాట్సాప్ త్వరలో ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. ఏదైనా ఒక మెసేజ్ వాట్సాప్‌లో విపరీతంగా ఫార్వార్డ్ అవుతుంటే.. అలాంటి మెసేజ్‌ను గుర్తించి అందులో నిజం ఉందా లేదా అని నిర్దారిస్తారు. అందుకు ఓ బృందం పనిచేస్తుంది. ఈ క్రమంలో సదరు మెసేజ్ ఫేక్ అని తెలిస్తే ఇక ఆ మెసేజ్‌ను ఏ యూజర్ పంపినా లేదా ఏ యూజర్ అయినా రిసీవ్ చేసుకున్నా వారికి సదరు మెసేజ్‌ను ఫేక్ లేదా స్పామ్ మెసేజ్ అని వాట్సాప్ అలర్ట్ పంపుతుంది. దీంతో అది నకిలీ మెసేజ్ అని యూజర్లకు ఇట్టే తెలిసిపోతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను వాట్సాప్ అంతర్గతంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో త్వరలో తెలిసే అవకాశం ఉంది.

click me!