చాముండేశ్వరికి, సిద్ధారామయ్యకి ఉన్న సంబంధం తెలుసా..?

First Published May 15, 2018, 8:50 AM IST
Highlights

చాముండేశ్వరిపై ఆశలు వదులుకోవాల్సిందేనా..?

కర్ణాటక ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.  ఇటీవల ఈ రాష్ట్రంలో పోలింగ్ జరగగా.. నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. యావత్ దేశంలోని ప్రధాన పార్టీల రెండింటి భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్దేశించనున్నాయి. కాంగ్రెస్‌, భాజపా రెండూ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈ కర్ణాటక ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం చాలా కీలకం.  ఈ నియోజక వర్గం నుంచి ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి సిద్ధా రామయ్య ఎన్నికల బరిలో నిలిచారు. భాజపా నుంచి ఎస్‌.ఆర్‌ గోపాల్‌ రావు, జేడీ(ఎస్‌) నుంచి జీటీ దేవెగౌడ పోటీలో ఉన్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం. సత్యనారాయణ గెలుపొందారు. 2013లో జీటీ దేవెగౌడ గెలుపొందారు.

సిద్ధా రామయ్య తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టింది ఈ నియోజకవర్గం నుంచే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఎప్పుడు పోటీ చేసినా.. గెలుపు ఆయననే వరించింది. ఈ సారి మాత్రం లెక్కలు తేడా కొడుతున్నాయి. ఈ నియోజకవర్గం గతంతో  పోలిస్తే.. చాలా అభివృద్ధి సాధించింది. దీంతో.. ఈ సారి ఆ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని అందరూ అనుకున్నారు.

కానీ.. ఏమైందో ఏమో.. ఈ ఎన్నికల ఫలితాలు కాస్త తేడాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల ప్రకారం..సిద్ధారామయ్య వెనకంజలో ఉన్నారు. దీంతో.. సిద్ధారామయ్య ఈ నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని అందరూ భావిస్తున్నారు.

click me!