తెలంగాణ యువకులకు 1,20,000 ఉద్యోగాల శుభవార్త

First Published Oct 18, 2017, 1:28 PM IST
Highlights

వచ్చే ఐదేళ్లో 1,20,000 ఉద్యోగాలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేన్ కోసం,డిఎస్ సిఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ పోరగాళ్లకి మరొక శుభవార్త. ఇది 1,20,000 ఉద్యోగాల తీపి కబురు. ఈ ముచ్చేటేందో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు చెప్పారు.

ఈ నెల 22 వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్  వరంగల్ లో  కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కి శంకుస్థాపన చేస్తున్నారు. దీని ఏర్పాట్ల కోసం ఉప ముఖ్యమంత్రి ఈ రోజు వరంగల్ వచ్చారు. వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ స్థాయి నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల తీపి కబురందించారు.

వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న   కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1, 20,000 ఉద్యోగ,  ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన చెప్పారు.

‘సీఎం కేసీఆర్ ఏదైనా గొప్పగా, పెద్దగా ఆలోచిస్తారు. వరంగల్ లో టెక్స్టై టైల్ పార్క్ కావాలని మేము అడిగితే ఆసియా లొనే అతి పెద్దదైన మెగా టెక్స్ టైల్ పార్క్ ఇచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో లభించే ప్రత్యేకతలు, విశిష్ఠలు ఉన్న బట్టలన్నీ మన దగ్గర దొరికే విధంగా ఈ పార్క్ ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాలు కూడ దండిగా ఉంటాయి,’ అని కడియం అన్నారు.

టెక్స్ టైల్ పార్క్ కు శంకు స్థాపన రోజే 669 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుకు, 72 కోట్ల వ్యయంతో నిర్మించే కాజీపేట-హన్మకొండ ఆర్వోబి, వరంగల్ లో ఐటీ పార్క్ కు విస్తరించే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని కూడా ఆయన చెప్పారు.
 

click me!