వర్జీనియా వర్సిటీలో కాల్పలు కలకలం

Published : Oct 15, 2017, 11:32 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
వర్జీనియా వర్సిటీలో కాల్పలు కలకలం

సారాంశం

కాల్పుల ఘనతో ఉలికిపడిన వర్జీనియా వర్జీనియా వర్సిటీలో కాల్పులు జిరిపిన దుండగుడు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వర్జీనియా స్టేట్‌ యూనివర్సిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. వర్సిటీ ప్రాంగణంలోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు క్యాంపస్‌ను మూసేసి.. ఆ ప్రాంతాన్నంతా ఖాళీ చేయించారు. అటువైపుగా ఎవరూ రావొద్దని సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఈ కాల్పుల ఘటనలో  ఒకరు గాయపడినట్లు సమాచారం. వర్సిటీకి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వర్సిటీలో ఎవరైనా తెలుగు  ప్రజలు ఉన్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

గత కొద్ది రోజుల క్రితం లాస్ వెగాస్ లో ఓ సంగీత కార్యక్రమం జరుగుతుండగా దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 60మందికి పైగా మృత్యువాతపడగా.. వందల మంది గాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !