మార్చి 17 నుంచి కర్ణాటక, ఆంధ్రలలో శ్రీనివాస కల్యాణం

First Published Mar 11, 2017, 6:29 AM IST
Highlights

 తిరుమలలో శ్రీవారి కల్యాణం కనులారా వీక్షించలేని సుదూర భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు 

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ మార్చి 17 నుండి 26వ తేదీ వరకు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. 


- మార్చి 17వ తేదీన కర్ణాటకలోని ముల్కి మండల కేంద్రంలో గల శ్రీ వెంకటరమణస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.


- మార్చి 18న బెంగళూరులోని త్రిపురవాసిని ప్యాలెస్‌ మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.


- మార్చి 25న ప్రకాశం జిల్లా ఒంగోలులోని పేర్నమిట్టలో స్వామివారి కల్యాణం జరుగనుంది.


- మార్చి 26న ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం, కరవాడి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.


    శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసల కోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకశ్రేణి ఉప కార్వనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

***

 

మార్చి 30న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

 

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 30వ తేదీన మత్స్య జయంతిని ఘనంగా జరుగనుంది.

 

 ఈ సందర్భంగా ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, తోమాల, అర్చన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు  భక్తులను అనుగ్రహిస్తారు.
 

click me!