
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు పన్ను పోటు మొదలయింది. అద్దె గదులకు జిఎస్ టి వర్తిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అద్దె ను బట్టి గదులపై 12శాతం, 18శాతం జిఎస్ టి ఉంటుంది. వెయ్యి రుపాయల లోపు అద్దె ఉండే గదులకు జిఎస్ టి నుంచి మినహాయింపు ఉంటుంది.
రు.1000- రు.2000 అద్దె ఉన్న కాటేజీలకు 12 శాతం జిఎస్ టి విధిస్తారు. అపుడు అద్దె ఇలా పెగుగుతుంది.
రు. 1500 నుంచి రు.1700లకు పెరుగుతుంది.
రు.2000ల నుంచి రు. 2200లకు పెరుగుతుంది.
రు. 2500 , ఆ పై న అద్దె ఉన్న కాటేజీలకు 18 శాతం జిఎస్ టి ఉంటుంది. అద్దె ఇలా మారుతుంది.
రు. 2500 నుంచి రు.3000 లకు పెరుగుతంది
రు.3000. నుంచి రు 3500 లకు పెరుగుతంది.
రు. 4000 నుంచి రు.4700 లకు పెరుగుతుంది.
రు. 4500 నుంచి రు.5300 లకు పెరుగుతుంది.
రు. 6000 లనుంచి రు.7100 లకు పెరుగుతంది.