వైట్ హౌజ్ లో భారత సంతతి వ్యక్తి

First Published Sep 13, 2017, 1:17 PM IST
Highlights
  • భారత సంతతికి చెందిన ఓ అమెరికన్ అగ్ర రాజ్యం అమెరికాలో కీలక బాధ్యతలు చేపట్టారు
  • అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్.. తన కమ్యూనికేషన్ టీమ్ లో ఇండియన్ అమెరికన్ రాజ్ షా కు చోటు కల్పించారు.

భారత సంతతికి చెందిన ఓ అమెరికన్ అగ్ర రాజ్యం అమెరికాలో కీలక బాధ్యతలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్.. తన కమ్యూనికేషన్ టీమ్ లో ఇండియన్ అమెరికన్ రాజ్ షా కు చోటు కల్పించారు. రాజ్  షా ఇప్పుడు ప్రెసిడెంట్ డిప్యుటీ అసిస్టెంట్ గానూ, ప్రిన్సిపల్ డిప్యుటీ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని వైట్ హౌస్ అధికారులు చెప్పారు.

 

అగ్రరాజ్యం అమెరికాకి 45వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్.. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్ షా ఆయన వెంటే ఉన్నారు. వైట్ హౌస్ లోని ముఖ్యమైన వెస్ట్ వింగ్ పవర్ ప్లేయర్లుగా ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఒకరుగా రాజ్ షా నిలిచారు. గుజరాత్ కి చెందిన రాజ్ షా తల్లిదండ్రులు.. 1980లోనే అమెరికా వచ్చి.. ఇక్కడ స్థిరపడ్డారు.

 

అదేవిధంగా రాజ్ షాతోపాటు మరో ఇద్దరికి కూడా ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు.  హోప్ హిక్స్ అనే యువతిని కమ్యూనికేషన్  టీమ్ డైరెక్టర్ గా నియమించారు. హిక్స్.. గతంలో  ఈమె ట్రంప్ కి అసిస్టెంట్ గా వ్యవహరించే వారు.

వీరితో పాటు మరో వ్యక్తికి కూడా ట్రంప్.. వైట్ హౌస్ లో కీలక బాధ్యతలు అప్పగించారు.స్టీవెన్ అనే వ్యక్తికి స్ట్రాటజిక్ రెస్పాన్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఇతను గతంలో ప్రెసిడెంట్ స్పెషల్ అసిస్టెంట్ గా వ్యవహరించారు.

 

click me!