పులి కెకె పిల్లి అయిపోయాడు...

Published : Jun 14, 2017, 07:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
పులి కెకె  పిల్లి అయిపోయాడు...

సారాంశం

గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ నుంచి కొనుగోలు చేసిన 36 ఎకరాల సేల్‌ డీడ్‌ను  రద్దు చేసుకుంటున్నాను. అయితే, భూములు కొనుగోలుకు మా కుటుంబ  సభ్యులు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా వాపసు చేయాలి. ఈ భూములను నాకు కట్టబెట్టిన వారిని కోర్టు కీడుస్తా.

లోపల ఏంజరిగిందో ఏమో,నిన్నమొన్న భూములను వివాదాం చేస్తే కోర్టు కెళతానని ఘీంకరించిన  టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నేడు వెనక్కి తగ్గారు. 

 

ఆయనకు, భూములను అందించిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు ఉన్న దోస్తి గురించి చర్చ తీవ్రమయ్యే సరికి కెకె చాలా ఆశ్చర్యకరమయిన, అసహజమయిన నిర్ణయం తీసుకున్నారు.

 

గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ నుంచి కొనుగోలు చేసిన 36 ఎకరాల సేల్‌ డీడ్‌ను  రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.

అయితే, భూములు కొనేందుకు తమ కుటుంబ సభ్యులు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా వాపసు చేయాలని ఆయన కోరారు.

తమకు ఈ భూమిని అమ్మినవారిని కోర్టుకీడుస్తానని కూడా ఆయన హెచ్చరించారు.

 

 సొంత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ఘర్షణకు  పోదల్చుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెకె చెప్పారు.

చేసిన తప్పుచాలక పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం పట్ల  ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారని తెలిసే కెకె ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం

 

             

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !