తల్లులు జీన్స్ వేసుకుంటే.. పిల్లలు ట్రాన్స్ జెండర్లౌతారా

First Published Apr 4, 2018, 2:03 PM IST
Highlights
అటిజం లక్షణాలు కూడా వస్తాయా

తల్లులు జీన్స్ వేసుకుంటే.. పిల్లలు ట్రాన్స్ జెండర్లౌతారా

 

నేటి తరం అమ్మాయిలు ఆధునిక వస్త్రధారణ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ మంది జీన్స్ వేసుకుంటారు.  అయితే.. వారి ధరించే దుస్తుల కారణంగా వారి పిల్లలు ట్రాన్స్ జెండర్లుగా, అటిజం వంటి లక్షణాలతో పుట్టే అవకాశం ఉందా? ఏమాత్రం పొంతన కుదరడం లేదు కదా..? కానీ.. ఓ ఉపాధ్యాయుడు మాత్రం ఇదే నిజమంటున్నాడు. మహిళల వస్త్రదారణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డాడు.

అసలు విషయంలోకి వెళితే... కేరళకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల కౌన్సెలింగ్ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయుడు రజిత్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు జీన్స్ ధరించడం వల్లనే వారికి పుట్టబోయే ఆడ పిల్లలు పురుషుడి లక్షణాలతో పుడుతున్నారని పేర్కొన్నారు.

దీంతో వారు ట్రాన్స్‌ జెండర్లుగా మారుతున్నారని, ఆటిజం వ్యాధితో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తల్లులు పురుషుల్లా వ్యవహరించడమే ఇందుకు కారణం అవుతుందని ఆయన పేర్కొన్నారు. టీచర్ చేసిన ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు టీచర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక నుంచి ఏ కార్యక్రమానికి రజిత్ కుమార్‌ను ఆహ్వానించొద్దని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శైలజ.. అన్ని ప్రభుత్వ సంస్థలకు, కార్యాలయాలకు ఆదేశాలు ఇచ్చారు.

click me!