స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు: 13 మంది పిల్లల మృతి

Published : Apr 26, 2018, 08:13 AM ISTUpdated : Apr 26, 2018, 10:22 AM IST
స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు: 13 మంది పిల్లల మృతి

సారాంశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. 

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలో గురువారం ఉదయం రైల్వే క్రాసింగ్ వద్ద రైలు ఓ పాఠశాల బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 13 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. మృతులు డివైన్ పబ్లిక్ స్కూల్ కు చెందినవారు. ఈ నెలలోనే అటువంటి సంఘటనే మరోటి జరిగింది. ఏప్రిల్ లో 10వ తేదీన జరిగిన ప్రమాదం 27 మంది పిల్లలు మరణించారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో పాఠశాల బస్సు 100 అడుగుల లోతు గల లోయలో పడడంతో ఆ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన 27 మంది పిల్లలు కూడా పది లోపు వయస్సు గలవారే.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu