తాగడానికి టాయ్ లెట్ వాటర్..

First Published Mar 16, 2018, 2:02 PM IST
Highlights
  • టాయ్ లెట్ వాటర్ తో డ్రింకింగ్ వాటర్
  • టాయ్ లెట్ వాటర్ రుచిగా ఉన్నాయంటున్న వాలంటీర్లు

ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నీటి కొరత పెరిగిపోతోంది. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. భూగర్భజలాలు ఎండిపోతుండటంతో.. నీటి సమస్య మరింత పెరిగిపోతోంది. రాను రాను ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే.. టాయ్ లెట్ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ గా మార్చేస్తున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైంటిస్టులు ఈ టాయ్ లెట్ వాటర్ పై పరిశోధనలు చేశారు. వీటిని రీసైకిల్ చేసి.. పూర్తిగా ప్యూరిఫై చేశారు. అనంతరం కొంత మందికి కళ్లకు గంతలు కట్టి ( బ్లైండ్ టెస్ట్).. వారికి సాధారణ మంచినీరు., టాయ్ లెట్ వాటర్ ని అందజేశారు. విచిత్రం ఏమిటంటే.. రెగ్యులర్ వాటర్ కంటే కూడా.. ఆ టాయ్ లెట్ వాటరే టెస్టీగా ఉన్నాయని బ్లైండ్ టెస్ట్ లో పాల్గొన్న వారు చెప్పారు. రీసైకిల్ చేసిన టాయిలెట్ నీళ్లను తాగడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని, అందులో ఎలాంటి హానికారిక వ్యర్థాలు ఉండవని వాళ్లు చెప్పారు. రీసైకిల్ చేసిన టాయిలెట్ నీళ్లు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయని, అందువల్ల ఈ నీటిపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని సైంటిస్టు ఆథర్ డేనియల్ హార్మన్ అన్నారు. 

ఈ టాయిలెట్ నీళ్ల బ్లైండ్ టెస్ట్‌లో మొత్తం143 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. సైంటిస్టులు రీసైకిల్ చేసిన నీళ్లు, నల్లా నీళ్లు, సీల్డ్ బాటిల్ నీళ్లను వేరువేరు కప్పుల్లో ఉంచి ఈ టెస్ట్ నిర్వహించారు. ఈ మూడు నీళ్లను తాగిన తర్వాత వాటికి ఒకటి నుంచి ఐదు వరకు ర్యాంకులు ఇవ్వాలని కోరారు. ఈ టెస్ట్‌లో నల్లా నీళ్ల కన్నా.. రీసైకిల్ చేసిన నీళ్లు, బాటిల్ నీళ్లను ఎక్కువగా ఇష్టపడ్డారు. అయితే ఈ మూడు శాంపిల్స్ రుచి ఒకేలా ఉందని వాళ్లు చెప్పడం గమనార్హం.

click me!