నేటి (శనివారం) రాశిఫలాలు

Published : Dec 30, 2017, 10:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
నేటి (శనివారం) రాశిఫలాలు

సారాంశం

శనివారం నాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి:

ధనానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. భార్య సహకారంతో విజయాలు సాధిస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి. ధనానికి సంబంధించి ఆలోచనలు చేస్తారు.

వృషభ రాశి:

అనుకున్నవన్నీ పూర్తి చేస్తారు. విందు భోజనం కూడా లభిస్తుంది. సోదరులు, పని వారి సహకారం ఉంటుంది. చేయు పనులలో అడ్డంకులు ఉంటాయి. దూరపు ప్రాంత వార్తలు వింటారు.

మిథున రాశి:

ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఏర్పడుతుంది. ఖర్చు గురించి ఆలోచన ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు బావున్నాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి:

అనుకున్న పనులు ఆటంకాలతో జరుగుతాయి. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వారితో ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు వారి పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.

సింహ రాశి:

దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. ఖర్చుల గురించి కొంచెం ఆలోచించవలసిన సమయం. పిల్లల విషయం సంతృప్తినిస్తుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి :

పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. ధన ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. ఇంటి పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. పిల్లల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలి. దూరపు బంధువుల రాకపోకలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తులా రాశి:

అనుకున్న పనులు బాధ్యతగా పూర్తి చేయవలసి ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు అనుకూలిస్తాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి:

భార్య సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. దైవ దర్శన ప్రాప్తి కూడా చేస్తారు. దూరపు బంధువుల వార్తలు కూడా వింటారు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి.

 ధనూ రాశి:

కొన్ని పనులు సులువుగా జరుగుతాయి. కొన్ని పనులు కష్టంగా జరుగుతాయి. ధనానికి ఇబ్బందులు ఉన్నాయి. కొత్త అవకాశాలు చేతికి వచ్చి జారిపోయే ప్రమాదం ఉంది. జాగర్త పడాల్సిన సమయం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి:

పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారంగా కూడా ఉండగలదు. తండ్రి గారి ఆశీర్వాదం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి.

కుంభ రాశి:

ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. తల్లి గారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. పిల్లలు చేసే పనులపై ఒక కన్నేసి ఉంచాలి. చేయు పనులందు లాభాన్ని ఆశిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి:

దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల యెడల శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. అనుకున్న పనులందు ఆటంకాలు కూడా ఉన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu