21 జనవరి 2018 ఆదివారం మీ రాశి ఫలాలు

Published : Jan 21, 2018, 08:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
21 జనవరి 2018 ఆదివారం మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం

మేషం: ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మితులతో కలిసి విహారయాతకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోతే ఇబ్బందిపడే అవకాశముంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం.

వృషభం

వృషభం : ఈ రోజు కొత్త పనులు పారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. అత్యుత్సాహానికి పోకుండా, ఆలోచనతో పనులు పూర్తి చేయండి.

మిథునం

మిథునం :ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో, గృహ, భూ సంబంధ లావాదేవీలలో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శతృవుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీ పై అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు

కర్కాటకం

కర్కాటకం :ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, అడ్డంకి ఎదురవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

కన్య

కన్య : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు, లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మార్పులుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. ఆధ్యాత్మిక క్షేతాల్ని సందర్శిస్తారు.

వృశ్చికం

వృశ్చికం :ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంతతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా టాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనం

మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పనైనా వాయిదా వేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu