2 జనవరి 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

Published : Jan 02, 2018, 10:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
2 జనవరి 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం : స్నేహితులు లేగా బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటా యి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణం కానీ చేస్తారు. విదేశీ ప్రయాణంకు సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. తలపెట్టిన పనులు పూర్తిచేయగలుగుతారు. చర్చలు సఫలం అవుతాయి.

వృషభం : వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పండాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కాని, ప్రశంసలు కాని పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

మిథునం : రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం : మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలెన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

సింహం ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

కన్య:  ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయంగా లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు.

తుల : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. కాంపిటేటివ్పరిక్షలు రాస్తున్నవారు విజయం సాధిస్తారు.

వృశ్చికం : ఈ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సెలవైనప్పటికీబయటకెళ్లటంకంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. గృహసంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావలసిన డబ్బు చేతికందుతుంది.

ధనుస్సు : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. షాపింగ్ చేయటం కాని, మిత్రులను కలవటం కానీ చేస్తారు అలాగే వాహన కొనుగోలు కానీ, రిపేర్ చేయించటం కానీ చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం : ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలువసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

కుంభం : మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

మీనం : కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కాని వివాదం జరగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu