09 మార్చి 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

First Published Mar 9, 2018, 8:47 AM IST
Highlights
  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం:ఈ రోజు పతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం.

వృషభం

వృషభం : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం.

మిథునం

మిథునం : ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్యకొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

సింహం

సింహం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య

కన్య : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చ. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.

తుల

తుల : ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి. దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

ధనుస్సు :

ధనుస్సు: ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

కుంభం

కుంభం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పైఅధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మీనం

మీనం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

click me!