5 ఫిబ్రవరి 2018 సోమవారం..మీ రాశిఫలాలు

Published : Feb 05, 2018, 08:41 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
5 ఫిబ్రవరి 2018 సోమవారం..మీ రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.

వృషభం

వృషభం : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.

మిథునం

మిథునం : ఈ రోజు మీ శరీరంలో నలతగా ఉండే అవకాశమున్నది. సమయానుకూల ఆహారం తీసుకోని కారణంగాఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడే అవకాశమున్నది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా ఆత్మీయుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు రావలసిన బకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చ వల సిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి.

సింహం

సింహం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కా లికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంత మవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది.

కన్య

కన్య : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు, ఎలర్జీ బారిన పడే అవ కాశముం టుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఫీలవు తారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీకు ఆనందంగా, లాభదాయకంగా ఉం టుంది. అనుకోని మిత్రులను కలువడం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మకరం

మకరం : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉం టుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సం బంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్ర లేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది.

కుంభం

కుంభం : ఈ రోజు మీ సహోద్యోగులతో, పైఅధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించడం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం.

మీనం

మీనం : ఈ రోజు మీ దాంపత్యజీవితం ఆనందమయంగా ఉంటుం ది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో కానీ, శుభకార్యక్రమంలో కానీ పాల్గొంటారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం , నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పరచుకోవడం చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu