04 ఫిబ్రవరి 2018..మీ రాశిఫలాలు

Published : Feb 04, 2018, 08:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
04 ఫిబ్రవరి 2018..మీ రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు  ఇలా ఉన్నాయి

మేషం

మీ ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో లేదా ప్రమోషన్ విషయంలో చేసే పయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

వృషభం

ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం, ఉద్యోగంలో మారు్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం చేస్తారు.

మిథునం

పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంతచిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

కర్కాటకం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీల కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

సింహం

మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కన్య

ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూల మార్పు చోటు చేసుకుంటుంది.

తుల

బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

వృశ్చికం

మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు

కొత్త పనులు ప్రారంభించటానికి, గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అనుకోని సాయం కారణంగా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

మకరం

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కుంభం

ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మీనం

ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపార వ్యవహారాలు కాని, ఇతర ఆర్థిక లావాదేవీలు కానీ అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu