ఫిబ్రవరి 2 శుక్రవారం 2018..మీ రాశి ఫలాలు

Published : Feb 02, 2018, 08:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఫిబ్రవరి 2 శుక్రవారం 2018..మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్యకొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం

వృషభం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కడుపు లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం

మిథునం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఇతరులతో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహం

సింహం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

కన్య

కన్య : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశముంటుంది. మీ కుటుంబ సభ్యుల కోసం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయటం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. మాట విషయంలో జాగ్రత్త అవసరం. మీ మాట కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది.

తుల

తుల : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ,లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న పయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేతదర్శనం చేసుకుంటారు.

మకరం

మకరం : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా వివాదాలు ఏర్పడతాయి.

కుంభం

కుంభం : ఈ రోజు మీ వృత్తికి సంబంధించిన ఒప్పందాలు పూర్తి చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టులు కాంట్రాక్టులు పూర్తి చేస్తారు. మీ వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర అపోహలకు తావివ్వకండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.

మీనం

మీనం : ఈ రోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆవేశానికి, అత్యుత్సాహానికి పోకుండా పనులు పూర్తి చేయండి. మీ పై అధికారులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకు లేదా వ్యక్తుల నుంచి రావలసిన ఆర్థిక సహాయం అందుతుంది.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu